మహిళతో హోటల్‌కు.. లిక్కర్ తాగుతూ వయాగ్రా టాబ్లెట్లు వేసుకున్నాడు.. ఉదయమే మరణం.. వైద్యులు ఏమంటున్నారంటే?

Published : Mar 07, 2023, 02:06 PM IST
మహిళతో హోటల్‌కు.. లిక్కర్ తాగుతూ వయాగ్రా టాబ్లెట్లు వేసుకున్నాడు.. ఉదయమే మరణం.. వైద్యులు ఏమంటున్నారంటే?

సారాంశం

నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి మహిళతో కలిసి హోటల్‌కు వెళ్లాడు. అక్కడ లిక్కర్ తాగుతూ వయాగ్రా టాబ్లెట్లు వేసుకున్నాడు. ఉదయమే ఒంట్లో నలతగా అనిపించిన అతడికి వాంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంత కాలానికి హాస్పిటల్‌ తీసుకెళ్లేలోపే మరణించాడు. పోస్టుమార్టం స్కాన్స్‌లో అయనలో 300 గ్రాముల రక్తం గడ్డకట్టినట్టుగా వైద్యులు గుర్తించారు. అందులో వయాగ్రా మెడికేషన్, లిక్కర్ కూడా ఉండటం గమనార్హం. వీటికి హైబీపీ తోడవడంతో ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.  

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఫీమేల్ ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆల్కహాల్ తాగుతూ రెండు వయాగ్రా టాబ్లెట్లు (50 ఎంజీ) తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత ఉదయమే ఒంట్లో నలతగా అనిపించింది. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. ఇది అరుదైన ఘటన అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

41 ఏళ్ల ఓ వ్యక్తి మహిళతో కలిసి హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఆల్కహాల్ తీసుకున్నాడు. అదే సమయంలో రెండు వయాగ్రా టాబ్లెట్లు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే అతని ఒంట్లో నలతగా అనిపించింది. వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీంతో అతనితోపాటే ఉన్న మహిళ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. కానీ, అతను అవసరం లేదని చెప్పాడు. గతంలోనూ తనకు ఇలాంటి లక్షణాలు కలిగాయని ఆమెకు వివరించాడు.

ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగానే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆస్పత్రి చేరేలోపే ఆయన మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని పేర్కొంటూ న్యూఎస్.ఏయూ.కామ్ అనే సైట్ రిపోర్ట్ చేసింది. ఆ కేసు స్టడీ చేస్తున్న వైద్యులే పై విషయాలను రివీల్ చేశారు.

Also Read: ఆర్ఎస్ఎస్ ఒక సీక్రెట్ సొసైటీ.. ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోలిక.. లండన్‌లో రాహుల్ గాంధీ

ఆ అధ్యయనం ప్రకారం, అతను సెరెబ్రోవస్కులర్ హీమోరేజ్‌కు గురైనట్టు విరవించారు. మెదడుకు అందే ఆక్సిజన్ తగ్గడం మూలంగా ఇది ఏర్పడుతుంది.

ఆ 41 ఏళ్ల వ్యక్తికి గతంలో అనారోగ్య చరిత్ర లేదు. సర్జికల్ హిస్టరీ కూడా లేదు. పోస్టుమార్టం స్కాన్స్‌లో ఓ కీలక విషయం వెలుగు చూసింది. ఆయనలో 300 గ్రాముల రక్తం గడ్డకట్టి కనిపించింది. అందులో ఆల్కహాల్, మెడికేషన్‌ రెండూ మిళితమై ఉన్నాయి. దీనికితోడు, అంతకు ముందటి హైబీపీ కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు ఓ నిర్దారణకు వచ్చారు. ఇది అరుదైన కేసు అని వైద్యులు చెప్పారు. అయితే.. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కు సంబంధించిన మెడికేషన్‌ను వైద్యుల సలహాతోనే తీసుకోవాలని సూచనలు చేశారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu