నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగరా.. నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

By team teluguFirst Published Jan 18, 2023, 1:01 PM IST
Highlights

ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధం అయ్యింది. ఎన్నికలకు సంబంధించిన తేదీలను నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రకటించనుంది. 

మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రకటించనుంది. ఈ  మూడు రాష్ట్రాల  అసెంబ్లీల పదవీకాలం మార్చిలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ప్రస్తుత నాగాలాండ్ అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం మార్చి 12తో ముగియగా, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ పదవీకాలం వరుసగా మార్చి 15, మార్చి 22న ముగుస్తుంది.

దేశభక్తి శక్తులను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్రలో పాల్గొంటాం - సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా

రాజ్యాంగం ప్రకారం ప్యానెల్ నాగాలాండ్‌లో ఎన్నికలను నిర్వహిస్తుందని ఎన్నికల కమిషన్ గత వారం తెలిపింది. ‘‘ఎన్ని పిలుపులు వచ్చినా మేము ఎన్నికలను నిర్వహిస్తాము. ఇది రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయదు ’’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పినట్లు ‘పీటీఐ’ పేర్కొంది.

వృద్ధుడిని బైక్ తో ఢీకొట్టాడని.. దళిత యువకుడిని కొట్టి చంపారు.. యూపీలో దారుణం..

కాగా.. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయ, నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో ఆ పార్టీ భాగస్వామిగా ఉంది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని బృందం గత వారం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించింది. ఈ పర్యటన అనంతరం మూడు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించేందుకు సీఈసీ వరుస సమావేశాలు నిర్వహించింది.

Election Commission of India (ECI) to announce the Schedule of General Elections to Legislative Assemblies of Nagaland, Meghalaya & Tripura today. pic.twitter.com/HKiaCw2eDK

— Lok Poll (@LokPoll)

ఈ సమావేశాలకు మూడు రాష్ట్రాల సీనియర్ రాజకీయ నేతలు, పౌర అధికారులు, కేంద్ర భద్రతా అధికారులు కూడా హాజరయ్యారు.

click me!