మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. మద్యం తాగి గురుద్వారాకు వెళ్లారు- పంజాబ్ సీఎంపై కూతురు ఆరోపణలు..

Published : Dec 10, 2023, 10:44 AM ISTUpdated : Dec 10, 2023, 03:20 PM IST
మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. మద్యం తాగి గురుద్వారాకు వెళ్లారు- పంజాబ్ సీఎంపై కూతురు ఆరోపణలు..

సారాంశం

Punjab CM Bhagwant Mann : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann)పై మొదటి భార్య కూతురు సీరత్ కౌర్ (Seerat Kaur) సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మద్యం తాగి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ప్రతిపక్షాలు భగవంత్ మాన్ పై విమర్శలు చేస్తున్నాయి. 

Seerat Kaur : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్ తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి తమని పట్టించుకోవడం లేదని చెప్పారు. సొంత పిల్లల బాధ్యతను చూసుకోలేని వ్యక్తి.. పంజాబ్ ను ఎలా చూసుంటారని ప్రశ్నించారు. తమ తండ్రి మద్యం తాగి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. అలాగే గురుద్వారాకు కూడా వెళ్లారని ఆరోపించారు.

భగవంత్ మాన్ మొదటి భార్య కూతురైన  సీరత్ కౌర్ తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేశారు. దానిని శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా శనివారం మీడియాకు చూపించారు. అందులో సీరత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను, మా తల్లి చాలా కాలం మౌనంగా ఉన్నాం. మా మౌనాన్ని మా బలహీనతగా భావించరాదు. మేము మౌనంగా ఉన్నందుకే ఆయన ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నారు’’ అని ఆరోపించారు. 

‘‘మా నాన్న మద్యం సేవించి గురుద్వారాకు వెళ్లారు. మాన్ తన రెండో భార్య ద్వారా మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మేము ఇతరుల దగ్గర నుంచి తెలుసుకున్నాం. నన్ను, నా సోదరుడిని మాన్ పక్కన పెట్టారు. ఇద్దరు చిన్న పిల్లలను వదిలేసిన వ్యక్తి మూడో బిడ్డకు ఎందుకు జన్మనివ్వాలని అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి పిల్లల బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతే, పంజాబ్‌ను నడిపించే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారు.’’

సీఎం మాన్ ను కలవడానికి తన సోదరుడు దోషన్ చేసిన ప్రయత్నాలను కూడా సీరత్ కౌర్ వీడియోలో వివరించింది. ‘‘ సీఎం ఇంటి రానివ్వలేదు. ఆయన పర్యటనల సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. మాన్ మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తారు. మద్యపానం చేస్తారు. అబద్ధాలు చెప్తారు. మద్యం మత్తులో అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.’’ అని ఆమె ఆరోపించింది. కాగా.. ఈ వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ‘ఎక్స్’ హ్యాండిల్ లో షేర్ చేశారు. భగవంత్ మాన్ పై మండిపడ్డారు.  శిరోమణి అకాలీదళ్ బిక్రమ్ సింగ్ మజితియా కూడా పలు విమర్శలు చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్