రాహుల్ కోసం మటన్ వండి పెట్టిన లాలూ..!

Published : Aug 05, 2023, 12:33 PM IST
రాహుల్ కోసం మటన్ వండి పెట్టిన లాలూ..!

సారాంశం

ఆయనకు పూల బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండి పెట్టడం విశేషం.   

రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం దావాలో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. రాహుల్ జైలు శిక్షపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. అయితే, ఈ తీర్పు వచ్చిన కాసేపటికే  రాహుల గాంధీని,  రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కలిశారు. ఆయనకు పూల బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండి పెట్టడం విశేషం. 

రాహుల్ ని లాలూ స్వయంగా తన కూతురు మీసా భారతి ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి కుమారుడు తేజస్వీ యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీని స్వాగతించారు. బొకే ఇచ్చి, ఆప్యాయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. రాహుల్ కోసమని ప్రత్యేకంగా బీహార్ నుంచి మటన్ తెప్పించి, లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా వండి వడ్డించారు. 

ఈ మటన్ ని రాహుల్ ఇష్టంగా తిన్నారట.ఇదొక్కటే కాదు, లాలూ వండిన ప్రతి వంటకాన్ని  ఆయన ఆస్వాదించారట. ఈ మటన్ ని బిహార్ నుంచి స్వయంగా తీసుకువచ్చి మరీ , వండినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంట్ లో అడుగుపెడుతుండటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..