
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు బీజేపీ నేతలు పోలరైజింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దుమారియాగన్‌కు చెందిన అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్... ఎన్నికల ప్రచారంలో మాట్లాడుడూ.. హిందూ ఓట్లను సంపాదించడానికి ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బిజెపి ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.. డుమారియాగన్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జై శ్రీరామ్ నినాదం ఉంటుందా లేదా వాలేకుమ్ సలామ్ నినాదం ఉంటుందా?” అని ఓటర్లను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇస్లామోఫోబిక్ ప్రశ్నకు ప్రజలు చప్పట్లు కొడుతూ జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.
అంతటితో ఆగకుండా .. "నన్ను మళ్లీ ఎమ్మెల్యేగా చేస్తే, ముస్లింలు బుర్గా ధరించడం మానేసి.. నుదుట తిలకం పెట్టుకోవడం ప్రారంభిస్తారు" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముస్లింలను అధికారం నుండి తొలగించడం వల్ల నగరం సురక్షితంగా మారిందని అన్నారు. ఇకపై నగరంలో గూండాలు, పేరుమోసిన నేరస్థులు వీధుల్లో కనిపించరని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ...వివిధ ప్రాంతాల పేర్లను మార్చామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, పిల్లలు సురక్షితంగా తిరుగుతున్నారనీ, వారు మన మహిళలపై కన్నేతి చూసే ధైర్యం చేయడం లేదని పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దూమారం రేగడంతో తన వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. తాను ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి ఇలాంటి ప్రసంగం చేసానని అన్నారు. యూపీలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నప్పుడు.. హిందువులు గోల్ టోపీలు ధరించవలసి వచ్చిందని అన్నారు. హిందువుల కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ అన్నారు. తనను ఓడించడానికి ముస్లింలు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి చర్యలను చూస్తూ..మౌనంగా ఉండబోనని అన్నారు.
తాను అధికారంలోకి వచ్చిన తరువాత గోల్ టోపీలు (స్కల్ క్యాప్స్) మాయమైనట్లు.. మళ్లీ ఎమ్మెల్యే అయితే.. ఈ సారి మియాన్ చిట్టా (తిలకం) ధరిస్తారని అని సింగ్ చెప్పుకోచ్చారు. రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వివాదస్పద ప్రసంగ వీడియో ఆన్‌లైన్‌లో రావడంతో కేసు నమోదు చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినికి యూపీ ఇన్‌ఛార్జ్ గా రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యవహరిస్తున్నారు.