Thanjavur girl suicide case: ప్రతిష్టాత్మక అంశంగా మార్చవ‌ద్దు.. ఈ కేసులో సీబీఐ విచార‌ణే క‌ర్టెక్ : సుప్రీం

Published : Feb 14, 2022, 01:50 PM IST
Thanjavur girl suicide case: ప్రతిష్టాత్మక అంశంగా మార్చవ‌ద్దు.. ఈ కేసులో సీబీఐ విచార‌ణే క‌ర్టెక్ : సుప్రీం

సారాంశం

Thanjavur girl suicide case: తంజావూరు విద్యార్థి ఆత్మహత్య కేసును సిబిఐ విచారణకు మార్చాలని  మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. విద్యార్థి ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణను అనుమ‌తించాల‌ని, ఈ కేసును ప్రతిష్టాత్మక అంశంగా మార్చవద్దని త‌మిళ‌నాడు పోలీసుల‌కు సుప్రీంకోర్టు తెలిపింది.   

Thanjavur girl suicide case: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపిన తంజావూరు బాలిక ఆత్మహత్య కేసు విచార‌ణ‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు మార్చాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమ‌వారం( ఫిబ్ర‌వ‌రి14) సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిష‌న్ పై స్పందిస్తూ.. తంజావూరు బాలిక ఆత్మహత్య కేసును సీబీఐ విచారించ‌డ‌మే స‌రైన ప‌ద్ద‌తి అనీ, మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స‌మ‌ర్థించింది. ఈ మేర‌కు ఈ కేసులోని అన్ని సాక్ష్యాలను సీబీఐకి   అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేర‌కు తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

ప్రకటనలో ఈ కేసును ప్రతిష్టాత్మక అంశంగా మార్చవద్దని  త‌మిళ‌నాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకు సేకరించిన అన్ని సాక్ష్యాలను సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం తమిళనాడు పోలీసులను కోరింది. బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై కూడా సీబీఐ విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటీసును 4 వారాల్లో వాపసు చేయవచ్చని, ఏదైనా కౌంటర్ అఫిడవిట్, రిజాయిండర్‌ను 2 వారాల్లోగా దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

తంజావూరులో ఏం జరిగింది?

ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ విద్యార్థిని జనవరి 9న  విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ను శుభ్రం చేయాలని, మెయింటెనెన్స్‌ పనులు చేయాలని హాస్టల్‌ వార్డెన్‌ తనను బలవంతం చేశారని ఓ వీడియోలో బాలిక ఆరోపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది. మ‌రోవైపు .. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆమె మృతిచెందినట్లు ఆరోపిస్తున్నారు.   అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.

 విచారణ జరిపించాలని, బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర డీఎంకే ప్రభుత్వాన్ని కోరడంతో బీజేపీ ఈ ఆరోపణలు రాజకీయ మలుపు తిప్పింది.  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై మైనర్ బాలిక వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. న్యాయమైన విచారణ జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని కోరారు.  

హాస్టల్‌ వార్డెన్‌ను జువైనల్‌ చట్టం కింద ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలతో పాటు అరెస్టు చేశారు. అయితే ఈ కేసును జనవరి 31న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును అప్ప‌గించాల‌ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కానీ.. మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు డీజీపీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బేల త్రివేదిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu