‘‘ హిందువులు త‌మ‌కు వ్య‌తిరేకం అని ముస్లింలు అనుకోవ‌ద్దు ’’- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Published : Jun 03, 2022, 01:50 AM IST
‘‘ హిందువులు త‌మ‌కు వ్య‌తిరేకం అని ముస్లింలు అనుకోవ‌ద్దు ’’- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

సారాంశం

జ్ఞానవాపి వివాదం విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొదటి సారిగా స్పందించారు. చరిత్రను మనం మార్చలేమని, అలాగే తయారు చేయలేమని చెప్పారు. జ్ఞానవాపిపై భక్తి ఉందని అలాగని ప్రతీ మసీదులో శివలింగం ఉందని ఎందుకు వెతుకుతూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలని అన్నారు.

హిందువులకు జ్ఞాన్ వ్యాపి పట్ల భక్తి ఉందని, అయితే ప్రతీ మసీదులో శివలింగాల కోసం వెతుకుతూ ఈ విషయాన్ని పెంచవద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులు తమకు వ్యతిరేకమం అని ముస్లింలు అనుకోవద్దని కూడా ఆయన అన్నారు. ‘‘ జ్ఞాన్ వ్యాపి వ్యవహారం కొనసాగుతోంది. మనం చరిత్రను మార్చలేము, మేము దానిని తయారు చేయలేదు. నేటి హిందువులు గానీ, నేటి ముస్లిములు గానీ దీన్ని సృష్టించలేదు. అది ఆ సమయంలో జరిగింది. దాడి చేసినవారి ద్వారా ఇస్లాం బయటి నుండి వచ్చింది. ఈ దాడుల్లో భారత దేశానికి స్వాతంత్రం కావాలనుకునే వారి మనోధైర్యాన్ని హరించేందుకే దేవస్థానాలను కూల్చివేశారు ’’ అని అన్నారు.

తెలంగాణ‌కు ప్ర‌ధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూప‌లేదు - అమిత్ షా 

జ్ఞాన్ వ్యాపి వివాదంపై మొదటిసారిగా మాట్లాడిన భగవత్.. హిందువులకు ప్రత్యేక భక్తి ఉన్న ప్రదేశాలపై సమస్యలను లేవనెత్తినట్లు చెప్పారు. ‘‘ హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచించరు. నేటి ముస్లిముల పూర్వీకులు కూడా హిందువులే. వారిని ఎప్పటికీ స్వాతంత్రం విషయంలో ఆలోచించ‌కుండా ఉంచడానికి,  నైతిక స్థైర్యాన్ని అణచివేయడానికి ఇలా చేశారు. కాబట్టి వారి మతపరమైన ప్రదేశాలను పునరుద్ధరించాలని హిందువులు భావిస్తున్నారు ’’ అని ఆయన అన్నారు.

‘‘ మనసులో సమస్యలుంటే పైకి లేస్తుంది. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. దీనిని అలా పరిగణించకూడదు. ముస్లింలు కూడా దీనిని అలా భావించకూడదు, హిందువులు కూడా అలా చేయకూడదు. ఈ విష‌యంలో పరస్పర అంగీకారం ద్వారా ఒక మార్గాన్ని క‌నుక్కోవాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారని, అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదించాలి అని చెప్పారు. మన న్యాయ వ్యవస్థ పవిత్రమైనది,న అత్యున్నతమైనది అని భావించి, దాని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి అని అన్నారు. కోర్టు నిర్ణయాలను మనం ప్రశ్నించకూడదు అని ఆయ‌న తెలిపారు. 

‘‘ మనకు కొన్ని ప్రదేశాల పట్ల ప్రత్యేక భక్తి ఉంది. అందుకే మనం వాటి విషయంలో మాట్లాడాము. అయితే ప్రతీ రోజూ మనం కొత్త విషయాన్ని తీసుకురాకూడదు. వివాదాన్ని మనం ఎందుకు ఎస్కలేట్ చేయాలి? మాకు జ్ఞాన్ వ్యాపి పట్ల భక్తి ఉంది. అయితే ప్రతీ మసీదులో శివలింగం కోసం ఎందుకు చూస్తారు? ’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్ర‌శ్నించారు. 

కాశ్మీర్ లో మ‌ళ్లీ రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. ఇద్ద‌రు వ‌ల‌స కార్మికుల‌పై కాల్పులు.. ఒక‌రు మృతి..

కాగా.. గ‌త నెల‌లో హ‌రిద్వార్ లో ఈ జ్ఞాన్ వ్యాపి వివాదం మొద‌లైంది. కోర్టు ఆదేశాలతో ఈ జ్ఞాప్ వ్యాపి మ‌సీదులో వీడియో గ్రాఫిక్ స‌ర్వే  నిర్వ‌హించారు. అయితే ఈ సర్వేలో శివ‌లింగం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈ అంశం ఒక్క సారిగా చ‌ర్చ‌నీయం అయ్యింది. అయితే కొంద‌రు దీనిని పూర్తిగా త‌ప్ప‌ని చెబుతున్నారు. మ‌సీదులో క‌నిపించింది శివ‌లింగం కాద‌ని, అది వాట‌ర్ ఫౌంటెన్ అని చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ఈ విష‌యం కోర్టు ప‌రిధిలో ఉంది. 

కాగా ఈ జ్ఞాన్ వ్యాపి వివాదం వెలుగులోకి వ‌చ్చిన త‌రువాత దేశంలోని అనేక ప్రాంతాల్లోని హిందువులు కోర్టుల్లో పిటిష‌న్లు దాఖలు చేశారు. ఆయా చోట్ల ఆలయం ఉందని నమ్మే మసీదుల్లో స‌ర్వే నిర్వ‌హించాల‌ని పిటిష‌నర్లు అందులో పేర్కొన్నారు. అందులో భాగంగానే శివాలయం ఉనికిలో ఉందని హిందువులు చెబుతున్న జుమా మసీదు సర్వే కోసం మంగళూరులో కేసు నమోదైంది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !