బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: హైకోర్టులో సవాల్ చేయనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

By narsimha lodeFirst Published Sep 30, 2020, 2:56 PM IST
Highlights

బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని గిలానీ ప్రకటించారు.


న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని గిలానీ ప్రకటించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ సహా 32 మందిపై కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.  ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని గిలానీ ప్రకటించారు.

also read:చీకటి రోజు, మసీదు దానికదే కూలిందా?: కోర్టు తీర్పుపై అసద్ కామెంట్స్

బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు జిలానీ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కోర్టు తీర్పుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ తీర్పుతో తాము సంతోషంగా లేమని ఆయన ప్రకటించారు. ఈ తీర్పుపై హైకోర్టులో తీర్పును సవాల్ చేస్తామని చెప్పారు.బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర పూరితంగా జరగలేదని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై సాక్ష్యాలను సీబీఐ సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. 
 

click me!