బాబ్రీ తీర్పు: ఆధారాలకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు

By team teluguFirst Published Sep 30, 2020, 1:42 PM IST
Highlights

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

బాబ్రీ మస్జీద్ కేసులో ఆధారాలు లేనందున మసీదు కూల్చివేత ఉద్దేశపూర్వక చర్యకాదని కోర్టు సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతిలకు ఊరట లభించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

మసీదు కూల్చివేత ఉద్దేశపూర్వక చర్య కాదు అని పేర్కొంది. 

ముద్దాయిలకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవు అని పేర్కొంది 

దాఖలు చేసిన ఆడియో, వీడియో క్లిప్స్ వాస్తవికతను సిబిఐ నిర్ధారించలేకపోయిందని పేర్కొంది. 

అసాంఘిక శక్తులు బాబ్రీ మసీదును కూలగొట్టడానికి ప్రయత్నిస్తుంటే.... సదరు ముద్దాయిలుగా పేర్కొన్న వారు వారిని ఆపడానికి ప్రయత్నించారని పేర్కొంది. 

అక్కడ ఇచ్చినటువంటి స్పీచులకు సంబంధించిన ఆడియో సరిగా లేదని కోర్టు పేర్కొంది. 

 

కోర్టుకు 26 మంది నిందితులు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్ 2000 పేజీల తీర్పు చదువుతున్నారు. హెడ్ కౌంట్ ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పును చదవడం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ సహా ఆరుగురు నిందితులను విచారించారు. నిందితులను, న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతించారు. కేసులో 48 మందిపై అభియోగాలు మోపారు. వీరిలో 17మంది విచారణ క్రమంలో మరణించారు.

ఈ కేసుకు సంబంధించి 32 మంది నిందితుల్లో  26 మంది కోర్టులో ఉన్నారు. అద్వానీ, ఉమాభారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్ లు కోర్టులో లేరు. ఉమా భారతి కోప్రొటాన్ బారిన పడి చికిత్స పొందుతుండగా, కళ్యాణ్ సింగ్ కోలుకుంటున్నారు. జోషి, అద్వానీలు వార్ధక్యం కారణంగా హాజరు నుండి మినహాయింపు పొందారు. 

click me!