ayodhya verdict: అయోధ్య తీర్పు.. బాబ్రీ యాక్షన్ కమిటీ అసంతృప్తి

By narsimha lodeFirst Published Nov 9, 2019, 12:28 PM IST
Highlights

బాబ్రీ మసీదు వివాదంపై బాబ్రీ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో అనే విషయమై నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది.


న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద భూమి  విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై బాబ్రీ యాక్షన్ కమిటీ  అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మభూమిన్యాస్‌కు కేటాయిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం నాడు తీర్పు ఇచ్చింది.

Zafaryab Jilani, All India Muslim Personal Law Board: Respect the verdict but the judgement is not satisfactory. There should be no demonstration of any kind anywhere on it. pic.twitter.com/g956DuJ5sB

— ANI (@ANI)

శనివారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం సున్నీ వక్ప్‌బోర్డు తరపు ప్రతినిధులు ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ప్రకటించారు.మరో వైపు ఈ తీర్పు వెలువడిన అనంతపురం బాబ్రీ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

Also read:also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తికరంగా ఉందని బాబ్రీ యాక్షన్ కమిటీ తరపు న్యాయవాది జిలానీ ప్రకటించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నట్టుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ప్రకటించింది. తీర్పు అసంతృప్తిగానే ఉన్నా కూడ తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. 

Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

మరోవైపు సుప్రీంకోర్టు పిటిషన్‌కు సంబంధించిన తీర్పు పాఠం అందిన తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో అనే విషయమై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఏఎస్ఐ రిపోర్టులో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ముస్లిం లా బోర్డు అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారీ కూడ తీర్పుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనకు ఆనందం కల్గించిందన్నారు. 

శనివారం నాడు  వివాదాస్పద భూమికి సంబంధించి శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై  సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం నాడు ఉదయం ఐదుగురు జడ్జిల ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

 అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.
 

click me!