ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చు: మైనర్ వివాహంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published : Jun 20, 2022, 04:13 PM IST
ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చు: మైనర్ వివాహంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సారాంశం

పంజాబ్ హర్యానా హైకోర్టు 16 ఏళ్ల ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవడం నేరం కాదని స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం, ఆమె పెళ్లికి అర్హురాలేనని, ముస్లిం అమ్మాయికి సంబంధించిన అంశాలు ముస్లిం పర్సనల్ లా కిందకు వస్తాయని కోర్టు తెలిపింది.   

న్యూఢిల్లీ: పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి దంపతులకు రక్షణ ఇస్తూ 16 ఏళ్లు మైనర్ బాలిక ఆమెకు ఇష్టం ఉన్న భాగస్వామిని ఎంచుకుని పెళ్లి చేసుకోవడానికి అర్హురాలు అని పేర్కొంది. జస్టిస్ జస్జీత్ సింగ్ బేడీ సింగిల్ జడ్జీ బెంచ్ సోమవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతులు తమ కుటుంబ సభ్యల నుంచి రక్షణ కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు పై తీర్పు ఇచ్చింది

కుటుంబ సభ్యలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు పిటిషనర్లకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాదనలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం పెళ్లికి సంబంధించిన అంశాలను ముస్లిం పర్సనల్ లా పరిధిలో ఉంటుందని తెలిపింది. 

ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొహమ్మదన్ లా బుక్‌లోని ఆర్టికల్ 195 ప్రకారం పిటిషనర్ 2 (16 ఏళ్ల అమ్మాయి), పిటిషనర్ 1 (21 ఏళ్ల అబ్బాయి)తో పెళ్లి చేసుకోవచ్చునని కోర్టు తెలిపింది. పిటిషనర్ 1 వయసు 21 ఏళ్లకు మించి ఉన్నదని వివరించింది. కాబట్టి, ముస్లిం పర్సనల్ లా ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అర్హులేనిన తెలిపింది.

చట్టం ప్రకారం వారు పెళ్లికి అర్హులు అయి ఉండి.. చట్ట పరిధిలోనే పెళ్లి చేసుకున్న ఆ దంపతుల ఆందోళనలను వినకుండా ఉండటం సబబు కాదని తెలిపింది. అందుకే ఆ దంపతులకు చట్టం ప్రకారం రక్షణ కల్పించాలని పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీని ఆదేశించింది.

పిటిషనర్ల ప్రకారం, 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి ఈ ఏడాది జూన్ 8వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే, వారి పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వారి అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కానీ, వారిని కాదని ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ముస్లిం లా ప్రకారం ఒక వ్యక్తి 15 ఏళ్లు నిండిన తర్వాత వారు పెళ్లికి అర్హులేనని చెబుతున్నదని పిటిషనర్లు కోర్టులో వాదించారు.
 

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?