
7 Terrorists Killed In Separate Encounters: గత 24 గంటల్లో భద్రతా దళాలతో జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో అరెస్టయిన టెర్రర్ అనుమానితుడితో సహా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుప్వారా జిల్లాలోని లోలాబ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టయిన షోకత్ అహ్మద్ షేక్‌తో సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల ప్రారంభంలో, షోపియాన్ జిల్లాలోని సెడోవ్ గ్రామానికి చెందిన షోకత్ అహ్మద్ షేక్‌ను జూన్ 2న IED పేలుడులో పాల్గొన్నందుకు మరో నిందితుడితో పాటు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టుల తర్వాత, పేలుడు కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక సూత్రధారిని కూడా గుర్తించారు. అరెస్టయిన ఉగ్రవాది వెల్లడించిన వివరాల ఆధారంగా, లోలాబ్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరం వద్ద ఆపరేషన్ ప్రారంభించి సోదాలు నిర్వహించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
"ఒక రహస్య స్థావరం శోధన సమయంలో అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు జాయింట్ సెర్చ్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అరెస్టయిన ఉగ్రవాది కూడా చిక్కుకున్నాడు" అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న సాయంత్రం మరో ఉగ్రవాది హతమయ్యాడు.
కుల్గామ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో, జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన ఇద్దరు స్థానిక రిక్రూట్‌లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూడో ఎన్‌కౌంటర్ పుల్వామాలో జరిగిందని, చత్‌పోరా గ్రామంలో రాత్రిపూట జరిగిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 114 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, ఇది గతేడాది ఇదే కాలంలో హతమైన ఉగ్రవాదుల కంటే రెట్టింపు అని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది హతమైన 114 మంది ఉగ్రవాదుల్లో 32 మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులపై తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు లోయ అంతటా కొనసాగుతాయని చెప్పారు. కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఉగ్రవాదులు అడ్డుకోలేరని అన్నారు.
"మహిళలు & పిల్లలు, నిరాయుధ పోలీసులు మరియు బయటి కార్మికులతో సహా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా లోయలో శాంతిని నెలకొల్పడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను ఉగ్రవాదులు అడ్డుకోలేరు. మా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కాశ్మీర్‌లోని 3 ప్రాంతాలలో, ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులపై ఏకకాలంలో దాడులు కొనసాగుతయన్నారు".