కేరళలో ముస్లిం సంస్థ సంచలన నిర్ణయం: అమ్మాయిల ముసుగులపై నిషేధం

By Siva KodatiFirst Published May 3, 2019, 1:48 PM IST
Highlights

కేరళలోని ఎంఈఎస్‌ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ ఆధ్వర్యంలో నడుస్తున్న 150 విద్యాసంస్ధల్లో విద్యార్ధినులు ముసుగు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది

కేరళలోని ఎంఈఎస్‌ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ ఆధ్వర్యంలో నడుస్తున్న 150 విద్యాసంస్ధల్లో విద్యార్ధినులు ముసుగు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీనిని అనుసరిస్తున్నారు. దాదాపు లక్షమంది విద్యార్ధులు ఎంఈఎస్ సొసైటీ విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

తమ కళాశాలలకు, పాఠశాలలకు వచ్చే అమ్మాయిలు ముసుగులు ధరించడానికి, ముఖం కప్పుకోవడానికి వీలు లేదని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ చదువుకుంటున్న వారిలో మెజారిటీ విద్యార్ధులు ముస్లింలే. దీంతో ఎంఈఎస్ ట్రస్ట్ అధ్యక్షుడు ఫజల్‌గపూర్ స్పందించారు. తాము వివాదాస్పద నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరం నుంచ తరగతులకు వచ్చే అమ్మాయిలు ముఖాన్ని ముసుగుతో కప్పుకోరాదన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డ్రెస్ కోడ్‌పై కాలేజ్ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. 
    

click me!