ఆటో డ్రైవర్... కోట్లు విలువచేసే విల్లా...

Published : May 03, 2019, 01:42 PM IST
ఆటో డ్రైవర్... కోట్లు విలువచేసే విల్లా...

సారాంశం

సాధారణంగా ఆటో డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది..? మహా అంటే.. మధ్యతరగతి జీవితాన్ని గడపగలరు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. 

సాధారణంగా ఆటో డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది..? మహా అంటే.. మధ్యతరగతి జీవితాన్ని గడపగలరు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. కోట్లు విలువచేసే విల్లాలో అతను నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు అతని ఇంటి వివరాలపై ఆరా తీయగా... విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసముంటున్న విలాసవంత విల్లాపై ఐటీ అధికారుల దాడిలో లోగుట్లు బయటపడుతున్నాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది.

సుబ్రమణికి అనుకోకుండా ఓ విదేశీ మహిళ పరిచయం అయ్యింది. ఆమె భారత్ లో ఆస్తులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సబ్రమణికి తెలిపింది. దీంతో.. అతను ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె చేత భవనం కొనిపించి.. తన పేరిట రాయించుకున్నాడని అధికారుల దర్యాప్తులో తేలింది.  ఆ భవనానికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?