శాంతిని నెలకొల్పేందుకే కాల్పుల విరమణ: మెహబూబా ముఫ్తీ

First Published Jun 19, 2018, 5:27 PM IST
Highlights

జమ్మూ మాజీ సీఎం ముఫ్తీ వ్యాఖ్యలు


శ్రీనగర్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తును పెట్టుకొన్నామని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.  పాక్‌తో సంబంధాల పునరుద్దరణ కోసం ప్రయత్నించినట్టు ఆమె చెప్పారు.  

సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం నాడు  సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు.  అధికారం కోసం తాము బిజెపిలో  చేరలేదని చెప్పారు.  కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందునే  ఆ పార్టీతో జట్టు కట్టినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు, అభివృద్ది కోసం తాము  బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.


రెండు పార్టీలు కలిసి కామన్ ఎజెండా ఏర్పాటు చేసేందుకు నెలల సమయం పట్టిందని ఆమె గుర్తు చేశారు.  పాక్‌తో చర్చలను పునరుద్దరణ జరగాలని కోరుకొన్న విషయాన్ని ఆమె చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. ప్రత్యేక హోదా, కాల్పుల విరణమ, 370 ఆర్టికల్ కోసం కృషి చేసినట్టు ముఫ్తీ ప్రకటించారు.

జమ్మూలో శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విరమణ అవసరమని భావించినట్టు ఆమె చెప్పారు.బలవంతపు విధానాలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు ముఫ్తీ. ముఖ్యమంత్రిగా జమ్మూ కాశ్మీర్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నించామని ఆమె చెప్పారు.

click me!