హత్య కేసులో జీవితఖైదు: కట్ చేస్తే అతను పోలీస్.. ఖంగుతిన్న ఉన్నతాధికారులు

By Siva Kodati  |  First Published Feb 4, 2020, 3:20 PM IST

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి రాష్ట్ర పోలీస్ శాఖలో 19 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. 


ఉత్తరప్రదేశ్‌ బరేలీలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి రాష్ట్ర పోలీస్ శాఖలో 19 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా దోషిగా తేలిన బరేలీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అభిపూర్ నివాసి ముఖేశ్ కుమార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Also Read:నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటన.. నోటీసులు పంపలేకపోయామన్న పోలీసులు

Latest Videos

undefined

ఆ తర్వాత ఆరా తీస్తే అతను పోలీస్ ఉద్యోగని, 19 ఏళ్ల నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ముఖేశ్ కుమార్ 2001లో ఉత్తరాఖండ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ సందర్భంగా తనను ఉత్తరాఖండ్‌లోని ఉదమ్ సింగ్ నగర్‌ నివాసిగా తెలిపాడు. అయితే 2000 నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

1997లో బరేలీలో జరిగిన ఓ హత్య కేసులో ముఖేశ్ ప్రమేయం ఉందని తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించిన తర్వాత బరేలీకి చెందిన నరేశ్ కుమార్‌ అనే స్థానికుడు అల్మోరా ఎస్పీకి లేఖ రాయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:దారుణం.. నడిరోడ్డుపై మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి...

దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ.. ముఖేశ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అలాగే అతని 19 ఏళ్ల కెరీర్‌లో భాగంగా వేరు వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన సమయంలో చేసిన నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పంత్‌నగర్ పోలీసులు తెలిపారు. 

click me!