గోవా జైలు నుంచి తప్పించుకుని 15 ఏళ్ల తర్వాత హోటల్‌లో చిక్కాడు.. అక్కడ ఏం చేస్తున్నాడంటే?

By Mahesh KFirst Published Dec 9, 2022, 3:17 PM IST
Highlights

గోవాలో జైలు నుంచి తప్పించుకున్న మర్డర్ కేసు దోషి 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్‌లో మళ్లీ పోలీసులకు దొరికాడు. ఆ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

గోవా: హత్యానేరం కేసులో దోషిగా తేలిన గోవా జైలు నుంచి 15 ఏళ్ల క్రితం పారిపోయాడు. మళ్లీ పశ్చిమ బెంగాల్‌లో ఓ హోటల్ చిక్కాడు. పుర్బా మెదినీపూర్ జిల్లాలో ఓ హోటల్‌లో పని చేస్తూ దొరికాడు. అతను దిఘా టౌన్‌లోని హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆ నిందితుడు తన డేట్ ఆఫ్ బర్త్‌ను జైలు నుంచి పారిపోయని తేదీగా మార్చాడు. 

అధికారుల సమాచారం ప్రకారం, భాత్లెం నివాసి జాక్సన్ డాడెల్, మరికొందరు కలిసి గోవాలోని కారంజాలెం నివాసి గాడ్విన్ డిసిల్వాను హతమార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య 2005 ఏప్రిల్ 23న జరిగింది. వీరిలో జాక్సన్ డాడెల్, మరో నిందితుడిని 2007 సెప్టెంబర్ 16న పనాజీ అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. అయితే, శిక్ష తీవ్రతను కోర్టు ప్రకటించకముందే జాక్సన్ జైలు నుంచి పరారయ్యాడు. జాక్స్, రుడోల్ఫ్ గోమ్స్, మరో 12 మంది నిందితులు మార్గావ్‌లోని జైలు గేట్లు ధ్వంసం చేసి బయటకు వచ్చి జైలు గార్డులను కొట్టారు. వారిని నిర్బంధించి పారిపోయారు. 

ఇందుకు సంబంధించి ఐపీఎస్‌లోని పలు సెక్షన్‌ల కింద మార్గావ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులు దోషుల కోసం గాలిస్తున్నారు.

Also Read: 23 అడుగుల గోడ దూకి జైలు నుంచి ఇద్దరు ఖైదీల ఎస్కేప్.. రేప్, మర్డర్ కేసుల్లో నిందితులు

పశ్చిమ బెంగాల్‌ పుర్బా మెదినీపూర్ జిల్లాలోని దిఘా టౌన్‌లో జాక్సన్ డాడెల్ పని చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకుని జాక్సన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

జాక్సన్ 15 ఏళ్లుగా పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. అతని పేరును రాజీవ్ కశ్యప్‌గా మార్చుకున్నాడని, ఓ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీసు మేనేజర్‌గా పని చేస్తున్నాడని వివరించారు. అతను తన డేట్ ఆఫ్ బర్త్‌ను జైలు నుంచి పారిపోయిన సెప్టెంబర్ 16వ తేదీగా మార్చుకున్నట్టు పేర్కొన్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మార్గావ్ పోలీసులకు అప్పగించామని వివరించారు.

click me!