100 మార్కుల పేపర్‌లో 115 మార్కులు వచ్చాయి.. ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్‌పై దుమారం

By Mahesh KFirst Published Mar 17, 2023, 2:39 PM IST
Highlights

గతేడాది నవంబర్‌లో బీఎస్సీ ఐదో సెమిస్టర్ విద్యార్థులు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు. గత వారం విడుదలైన ఈ ఫలితాలు చూసి వారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఆరుగురు విద్యార్థులకు పేపర్ సెట్ చేసిన గరిష్ట మార్కులకు మించి వచ్చాయి. అంటే.. 100 మార్కుల పేపర్‌లో వారికి 115 మార్కులు, 104 మార్కులు రావడంతో ఈ ఫలితాలపై దుమారం రేగింది.
 

ముంబయి: వంద మార్కుల పేపర్‌లో గరిష్టంగా మార్కులు ఎన్ని వస్తాయి? వంద మార్కులకు వంద మార్కులు రావడమే అద్భుతంగా.. అసాధారణంగా ఉంటుంది. కానీ, వారికి వంద మార్కుల పేపర్‌లో 115 మార్కులు వచ్చాయి. ముంబయి యూనివర్సిటీ ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థుల ఫలితాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. గరిష్ట మార్కులకు మించి మార్కులు రావడంపై పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతున్నది.

ముంబయి యూనివర్సిటీ ఐదో సెమిస్టర్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన ఆరుగురు విద్యార్థులకు మార్కులు పోటెత్తి వచ్చాయి. పేపర్ గరిష్ట మార్కులకు మించి వారికి మార్కులు వచ్చాయి.  అందులో కొందరికి 115 మార్కులు వచ్చాయి. ఇద్దరికి 104 మార్కులు వచ్చాయి. ముంబయి యూనివర్సిటీ బీఎస్సీ మ్యాథమేటిక్స్ పరీక్షను గతేడాది నవంబర్‌లో నిర్వహించారు. 

Also Read: ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా పునరుద్ధరించడం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య.. ‘కానీ నీవు రాజీనామా చేశావ్ కదా’

అంతేనా..ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఓ గమ్మత్తైన చిత్రాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా గతంలోనూ రిపోర్ట్ చేసింది. అదేమంటే.. ఎగ్జామ్‌కు అటెండ్ అయినవారినీ ఆబ్సెంట్ అని పేర్కొంది. ఈ తప్పులను సరిదిద్దుతామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. లెక్కల పరీక్షలోనే మార్కుల లెక్క తప్పి.. గరిష్టానికి అధికంగా రావడం చర్చనీయాంశమైంది.

గరిష్ట మార్కులకు మించి విద్యార్థులకు మార్కులు వేయడం అక్కడి లోపాలను స్పష్టంగా విషదపరుస్తున్నదని మాజీ సెనేట్ మెంబర్ వ్యాఖ్యానించారు.

click me!