ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు.. ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో స్టూడెంట్లకు మంచి విద్య

By Mahesh KFirst Published Mar 17, 2023, 2:01 PM IST
Highlights

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు కురిపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా రంగంపై ఫోకస్ పెట్టిందని, ఫలితంగా దేశ రాజధానిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ఈ రోజు మాట్లాడారు.
 

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసలు కురిపించారు. విద్యా రంగాన్ని మెరుపరచడానికి ఎంతో ఫోకస్ పెట్టిందని వివరించారు. విద్యార్థులకు మంచి విద్య అందేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ రాజధానిలో ఇప్పుడు విద్యార్థులు మంచిగా చదువుకుంటున్నారని చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఇవాళ్ల మొదలవుతున్నాయి. తొలి రోజున అసెంబ్లీలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తన తొలి ప్రసంగం ఇచ్చారు. ఢిల్లీలో విద్య, వైద్యారోగ్య మౌలిక వసతులను నవీకరించిందని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 

ఢిల్లీలో ఇప్పటికే ఉన్న హాస్పిటళ్లను నవీకరిస్తున్నారని, వీటికితోడు కొత్త హాస్పిటళ్లతో అదనంగా 16,000 పడకలు వచ్చి చేరుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వివరించారు.

Also Read: ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా పునరుద్ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య.. ‘కానీ నీవు రాజీనామా చేశావ్ కదా’

ఢిల్లీ లిక్కర్ పాలసీ సహా పలు అంశాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంగా వాగ్వాదాలు జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ పాలన సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని, ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆప్ ప్రభుత్వం పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

click me!