షాకింగ్ న్యూస్... టీవీ నటిపై అత్యాచారం..

Published : Sep 21, 2018, 10:03 AM IST
షాకింగ్ న్యూస్... టీవీ నటిపై అత్యాచారం..

సారాంశం

గతంలో ఈమెతో కలిసి చదివిన క్లాస్ మేట్ అయిన యువకుడు సోషల్ మీడియా ద్వారా మళ్లీ ఆమెను కలిశాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారు

ప్రేమ పేరుతో దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ టీవీ నటిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన  రాజస్థాన్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువతి ముంబై నగరంలో చదువుకుంది. చదువు పూర్తయ్యాక మోడల్ గా పనిచేస్తూ టీవీ నటిగా మారింది. గతంలో ఈమెతో కలిసి చదివిన క్లాస్ మేట్ అయిన యువకుడు సోషల్ మీడియా ద్వారా మళ్లీ ఆమెను కలిశాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. టీవీ నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి యువకుడు ఆమెను రాజస్థాన్ లోని నీమ్రానా పట్ణణానికి తీసుకువెళ్లాడు. 

అక్కడ కొందరిని తన కుటుంబసభ్యులని పరిచయం చేసిన యువకుడు అక్కడే గదులు బుక్ చేశాడు. నీమ్రానా పట్టణంలోని హోటల్ గదిలో తనపై యువకుడు అత్యాచారం చేశాడని టీవీనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం