రాహుల్ చౌకబారు చేష్టలు మానుకో: అరుణ్ జైట్లీ వార్నింగ్

By Nagaraju TFirst Published Sep 20, 2018, 8:06 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్‌ డీల్‌పై రాహుల్‌ గాంధీ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్‌ డీల్‌పై రాహుల్‌ గాంధీ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్‌ డీల్‌పై, ఎన్‌పీఏలపై అసత్యాలు చెబుతున్న రాహుల్‌ కన్నుగీటడం, కౌగిలింతల వంటి తన చౌకబారు చేష్టలతో ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఒక అవాస్తవాన్ని అదే పనిగా చెబుతుంటే దాన్ని నిజమని ప్రజలు విశ్వసిస్తారనే భ్రమలో రాహుల్‌ ఉన్నారని విమర్శించారు. ఎన్‌డీఏ పాలనను విమర్శించేందుకు కారణాలు దొరక్కపోవడంతో రాఫెల్ డీల్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు.  

రాఫెల్‌ డీల్‌లో అక్రమాలు జరిగాయనేది అబద్ధమని, 15 మంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు బకాయిపడిన రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రధాని మోదీ మాఫీ చేశారనేది అవాస్తవమన్నారు. రాహుల్‌ చెప్పే ప్రతి మాట అవాస్తవాలతో కూడుకున్నదే తప్ప వాస్తవం ఏమీ లేదన్నారు.  

click me!