జనతా కర్ఫ్యూ : మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

By AN Telugu  |  First Published Apr 14, 2021, 7:44 PM IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

మహారాష్ట్రలో బుధవారం నుంచి రెండు వారాల పాటు  లాక్ డౌన్ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వలస కూలీలు సొంతూళ్లకు పయనమవ్వడంతో బుధవారం స్థానిక కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై రైల్వే స్టేషన్ రద్దీగా మారింది.

Latest Videos

undefined

భారీ సంఖ్యలో ప్రయాణికులు అక్కడికి చేరుకోవడంతో రైల్వే పోలీసులు అదనపు బలగాలను మొహరించాల్సి వచ్చింది. తాజా పరిస్థితులపై కేంద్ర రైల్వే చీఫ్ శివాజీ సుతార్ మాట్లాడుతూ.. ప్రజలెవరూ కంగారు పడొద్దు అని తెలిపారు.

వైరస్ దృష్ట్యా స్టేషన్ల వద్ద గుంపులుగుంపులుగా ఉండొద్దరని సూచించారు. టికెట్లు కన్ఫర్మ్ అయిన వారు మాత్రమే స్టేషన్లకు రావాలని కోరారు.  బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

జనతాకర్ఫ్యూలో భాగంగా రాష్ట్రం అంతటా 144 సెక్షన్ అమలు అవుతుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదు అని అధికారవర్గాలు చెబుతున్నాయి. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేయనున్నారు. అయితే ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, మెడికల్ షాప్స్, వ్యాక్సినేషన్ కేంద్రాలు వంటి అత్యవసర సేవల పై ఎలాంటి నిబంధనలు విధించలేదు.
 
click me!