అమానుషం : దళిత యువకుడితో ఉమ్మి నాకించి, మూత్రం తాగమంటూ..

Published : Apr 14, 2021, 06:37 PM ISTUpdated : Apr 14, 2021, 06:38 PM IST
అమానుషం : దళిత యువకుడితో ఉమ్మి నాకించి, మూత్రం తాగమంటూ..

సారాంశం

భారతరత్న దళితుల ఆరాధ్యదైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడే బీహార్ లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి అతని దారుణంగా అవమానించారు.

నేలపై ఉమ్మి వేసి అతడితో బలవంతంగా నాకించారు. మూత్రం తాగాలంటూ అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. గయాలోని వజీర్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. దీని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రేమించినందుకు శిక్షగా పంచాయతీలో ఉన్న పలువురు వ్యక్తులు నేలపై ఉమ్మివేయగా.. ఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని ఉమ్మి నాకుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం మూత్రం తగ్గాలంటూ పంచాయతీ పెద్దలు అతడిని బలవంతం చేశారు.

17 ఏళ్ల ఈ యువకుడు ఇటీవల తాను ప్రేమించిన యువతితో కలిసి పారిపోయి వివాహం చేసుకున్నాడు. అతడు తన తప్పును అంగీకరించినప్పటికీ యువతి తల్లిదండ్రులు ఆ జంట ను పట్టుకుని పంచాయితీ పెట్టించారు. అతడికి శిక్ష విధించాల్సిందేనని పెద్దలు తీర్మానించడంతో పంచాయతీ సభ్యులు సర్పంచ్ ముందే ఆ దళిత యువకుడిని అమానుషంగా కొట్టి హింసించారు.

 కాగా ఈ ఘటనపై వీడియో వైరల్ కావడంతో గయా పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టు చేశామని ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని గయా ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు.
 
PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్