షాకింగ్ : కౌగిలింతలో మృత్యుఒడికి చేరుకున్న బావామరదళ్లు.. !

By AN TeluguFirst Published Apr 14, 2021, 5:08 PM IST
Highlights

ఆ జంట ప్రేమలో గెలిచింది. కానీ జీవిత పయనంలో ఓడింది. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణంతో ఒకటయ్యారు. బెంగుళూరుకు చెందిన ఓ జంట చెన్నైలో రోడ్డు పక్కగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న రీతిలో మృతదేహాలు గా కనిపించడం సర్వత్రా విషాదాన్ని నింపింది. 

ఆ జంట ప్రేమలో గెలిచింది. కానీ జీవిత పయనంలో ఓడింది. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణంతో ఒకటయ్యారు. బెంగుళూరుకు చెందిన ఓ జంట చెన్నైలో రోడ్డు పక్కగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న రీతిలో మృతదేహాలు గా కనిపించడం సర్వత్రా విషాదాన్ని నింపింది. 

పోలీసుల కథనం మేరకు చెన్నై పళ్లికరణై మార్గం చిట్లపాక్కం అరసన్‌ కాలనీ నుంచి సోమవారం అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో పెరుంబాక్కం పోలీసులకు ఓ ఫోన్ కాల్ వెళ్లింది. రోడ్డు పక్కన ఓ యువతీ, యువకుడు కౌగిలించుకున్న స్థితిలో అచేతనంగా పడి ఉన్నారని ఫోన్ వచ్చింది. 

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పరిశీలించగా అప్పటికే మరణించినట్లు తేలింది. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డు, చిరునామాల ఆధారంగా బెంగుళూరు ఆర్కే పురానికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నై కి ఎందుకు వచ్చారని విచారించగా... ఆ జంట ప్రేమ కథ వెలుగుచూసింది.

విచారణలో వెలుగుచూసిన అంశాల మేరకు అభినేష్‌(30), పల్లవి(30) బావ మరదళ్లుగా గుర్తించారు. అభినేష్ బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఈ వ్యవహారం పల్లవి తల్లి గాయత్రి దృష్టికి చేరింది. వీరి ప్రేమకు ఆమె అడ్డు చెప్పడమే కాదు, పల్లవిని తీవ్రంగా మందలించింది, దీంతో 10 రోజుల క్రితం ఇల్లు వదిలి అభినేష్ తో కలిసి చెన్నైకు పల్లవి చేరుకుంది.

 తాంబరం చిల్లపాకం మార్గంలోని పిల్లయార్ కోవిల్ వీధిలోని తన సోదరి ఇంటికి పల్లవితో అభినేష్ చేరుకున్నాడు. కూతురు కనిపించకపోవడంతో.. వీరి కోసం గాలింపు చేపట్టిన గాయత్రీ ఎట్టకేలకు చెన్నైలో ఉన్నట్లు గుర్తించింది. అభినేష్ సోదరికి చీవాట్లు పెట్టింది.

ఆందోళన చెందిన ఆమె ఇద్దరిని బెంగుళూరు వెళ్లిపోవాలని హెచ్చరించింది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బెంగళూరుకు వెళితే విడదీస్తారని, ప్రాణహాని తప్పదన్న ఆందోళన వారిలో నెలకొంది.

దీంతో కలిసి బతకలేకపోయినా.. కలిసి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ విషం తాగి ఒకరినొకరు కౌగిలించుకుని మరీ మృత్యుఒడిలోకి చేరారు. పోలీసులు ఈ సమాచారాన్ని బెంగుళూరులోని కుటుంబ సభ్యులకు పెరుంబాక్కం పోలీసులు అందజేశారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్ పేటకు తరలించారు. వీరి మరణానికి కారణమైన గాయత్రిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. బెంగళూరు నుంచి మంగళవారం వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతకూ రాకపోవడంతో మృతదేహాలను మార్చరీకి తరలించారు.

click me!