ట్రైన్ లో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Dec 27, 2022, 9:34 AM IST
Highlights

ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ లో తనతో పాటు కలిసి పయనిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి వేదించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో సబర్బన్ రైలులో ఒక మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధించినందుకు గాను ముంబై పౌర సంస్థ సిబ్బందిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 50యేళ్ల వ్యక్తి. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడు. ఈ ఘటన డిసెంబర్ 23న జరిగింది. వాసి రోడ్ రైల్వే స్టైషన్ లో చోటు చేసుకుంది. 

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. లోకల్ ట్రైన్ లో వెడుతున్న సమయంలో కంపార్ట్ మెంట్లో నిందితుడు తనతో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధించాడు. ట్రైన్ నలసొపరా-విరార్ మధ్యలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఇది గమనించిన మహిళ వెంటనే పక్కనున్న వాళ్లను అతడి చర్యల మీద అలర్ట్ చేసింది. దీంతో వారు నిందితుడుని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.. అని పోలీసులు తెలిపారు. 

షాకింగ్.. బాయ్ ఫ్రెండ్ కు అక్క న్యూడ్ వీడియోలు పంపిన చెల్లెలు.. బ్లాక్ మెయిల్ చేసి..

మహిళ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించి, వేధింపులకు గురి చేయడం కింద సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. ఈ శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు సంబంధించిన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతను ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని ఒక కాలేజీ కి సంబంధించిన ఆర్గనైజింగ్ పార్టనర్ కి అల్లుడు. గతంలో  కర్నూలులో పని చసే సమయంలో..  తనతో పాటు పనిచేసిన ఓ మహిళా అధికారిణిని లోబరుచుకున్నాడు. ఆమె ఒంగోలుకు చెందిన అధికారిణి. ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారిని ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తుంది.  

బీహార్ లో పరువు హత్య : చెల్లితో సన్నిహితంగా ఉన్నాడని, చంపి, ముక్కలు చేసి.. కుక్కలకు ఆహారంగా వేశాడు..

వీరిద్దరు కలిసి కొంతకాలం సహజీవనం కూడా చేసినట్లుగా సమాచారం. అంతేకాదు సదరు  డ్రగ్ ఇన్ స్పెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో పనిచేసే సమయంలో ఇదే విషయం మీద అక్కడి అధికారులకు ఆ మహిళా అధికారిణి  ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో వారు వీరిద్దరికీ కౌన్సిలింగ్ చేసి  పంపించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తనకు న్యాయం జరగలేదని ఆమె ఇప్పుడు మీడియాను ఆశ్రయించింది. 

ఫిర్యాదు విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అని ప్రశ్నించగా..  ఆ మహిళా అధికారిణి కావాలనే తనను తనపై వేధింపులకు పాల్పడుతూ ఉందని అన్నారు. కర్నూలులో కౌన్సిలింగ్ తర్వాత ఆ సమయంలో ఆమెను అధికారులు మందలించారని  తెలిపాడు. తన కుటుంబం నుంచి తనను విడదీయడానికి ఆమె బెదిరింపులకు పాల్పడుతోందని అన్నాడు.  ఏదేమైనా వీడియోలు బయటకు రావడంతో వ్యవహారం ఇప్పుడు ఒంగోలు జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. 

click me!