నగల దుకాణంలో చోరీ..రూ. 74 లక్షల విలువైన ఆభరణాలతో పరార్.. కట్ చేస్తే..  

By Rajesh KarampooriFirst Published May 30, 2023, 11:42 PM IST
Highlights

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని గోరేగావ్‌ ప్రాంతంలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడి, ₹ 74 లక్షల విలువైన వస్తువులతో పరార్ అయిన 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు. రాజస్థాన్‌లోని రాజస్‌మండ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు పట్టుకుని, అతని నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు గోరేగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు.

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని నగల దుకాణంలో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీలో 74 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నగల దుకాణంలో చోరీ జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా బంగారు, వెండి వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు . ఇప్పుడు ఈ కేసులో రాజస్థాన్ లో ఒక నిందితుడిని అరెస్టు చేశారు.

74 లక్షల విలువైన నగలు చోరీకి పాల్పడిన కేసులో రాజస్థాన్‌కు చెందిన సురేశ్ లోహర్ అనే 28 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ సత్యన్నారాయణ తెలిపారు. నిందితుల నుంచి చోరీకి గురైన రూ.74 లక్షల విలువైన ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సురేష్ లోహర్ అదే నగల దుకాణంలో పనిచేసేవాడని, డ్రింక్‌లో మత్తు మందు వేసి షాపు యజమానిని అపస్మారక స్థితికి చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు.

నగలను ఎక్కడ దాచారు?

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించిన అనంతరం నిందితులు ఈ ఆభరణాలను స్నేహితుడి వద్ద దాచారు. ఆ తర్వాత అతనే రాజస్థాన్‌కు పారిపోయాడు. ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అరెస్టయిన నిందితులకు చాలా మంది సహచరులు ముంబైలోని ఇతర జ్యువెలరీ షాపుల్లో పనిచేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, వాడాలా ప్రాంతంలోని నగల దుకాణంలో చోరీ కేసును కూడా అంగీకరించాడు. నిందితుడు సురేశ్‌ లోహర్‌, అతని సహచరులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) 392 (దోపిడీకి శిక్ష), 380 (నివాస గృహంలో దొంగతనం) సహా సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.  


మరో నగల దుకాణంలో చోరీ..  


ముంబైలోని కండివాలి గణేష్ నగర్ లాల్జీ పాడాలో నగల దుకాణం యజమానిని కాల్చి చంపిన నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పట్టుకున్నారు. నివేదిక ప్రకారం నిందితుడి పేరు రోహిత్ పాల్. హత్య చేసిన వెంటనే రైలు ఎక్కి.. ఉత్తరప్రదేశ్ కి పారిపోయాడు. అదే సమయంలో ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డయింది. ఇందులో నిందితుడు రోహిత్ పాల్.. 32 ఏళ్ల మనోజ్ సింగ్ చౌహాన్‌ను కాల్చిచంపినట్టు గుర్తించారు.  

ఈ హత్య అనంతరం నిందితుడు స్టేషన్‌కు చేరుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కూడా రికార్డయ్యారు. హత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. కానీ, ఇతర మూలాల ప్రకారం.. హత్య వెనుక కారణం ప్రేమ వ్యవహారమేననీ తెలుస్తోంది. అయితే.. పోలీసులు ఈ వ్యవహరాన్ని ముందుగా కొట్టిపారేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో దీనిపై కందివలి పోలీసులు విచారణ చేపట్టారు.
 

click me!