భారత్‌పై మిడతల దాడి ఇప్పుడే కాదు.. 1903లోనే ముంబైలో జరిగిందన్న కె.వి. ఆనంద్

By Siva KodatiFirst Published May 29, 2020, 7:49 PM IST
Highlights

అసలే కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇది  చాలదన్నట్లుగా భారత్‌పైకి మిడతలు దండయాత్రకొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ఇదేదో ఇప్పుడే ముంచుకొచ్చిన విపత్తు కాదు. 1903లోనే భారతదేశంపై మిడతల దాడి జరిగిందని తమిళ దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు

అసలే కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇది  చాలదన్నట్లుగా భారత్‌పైకి మిడతలు దండయాత్రకొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ఇదేదో ఇప్పుడే ముంచుకొచ్చిన విపత్తు కాదు. 1903లోనే భారతదేశంపై మిడతల దాడి జరిగిందని తమిళ దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు.

ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో మిడతల దాడి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నాశనం కావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశంలోని ఈ పరిస్ధితి నేపథ్యంలో కె.వి ఆనంద్ తీసిన బందోబస్త్ సినిమా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మిడతల దాడి గురించి ఆయన మాట్లాడుతూ.. మనం ఎదుర్కొంటున్న మిడతల దాడి గురించి తనకు మెస్సేజ్‌లు వస్తున్నాయి.

Also Read:రాయదుర్గంలో మిడతల కలకలం: ఆందోళనలో స్థానికులు

వాళ్లు పంపించిన ఫోటోలు, మెసేజ్‌లు చూస్తే తనకెంతో బాధగా అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్‌‌ పేపర్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే ఆర్టికల్స్, నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకునే ఇప్పటి వరకు సినిమాలు తెరకెక్కించానని ఆనంద్ తెలిపాడు.

అలా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై వీడొక్కడే,అవిభక్త కవలలు గురించి బ్రదర్స్ చిత్రాలను రూపొందించానని చెప్పారు. బ్రదర్స్ షూటింగ్ సమయంలో తూర్పు ఆఫ్రికా వెళ్లినప్పుడు మిడతల దాడిని ప్రత్యక్షంగా చూశానని, ఆ సమయంలో తాను ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ 30 నిమిషాలు రోడ్డుపైనే ఆపేశాడని నాటి సంఘటనను ఆనంద్ గుర్తుచేసుకున్నారు.

ఎందుకు అని ప్రశ్నించగా.. మిడతల దాడి గురించి వివరించాడు. ఆ తర్వాత తాను దాని గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నానని.. ఈ విషయంలో తన అసిస్టెంట్స్ కూడా సాయం చేశారని గుర్తుచేసుకున్నాడు.

Also Read:విశాఖకు చేరుకున్న మిడతల దండు?!

అలా ఎప్పటి నుంచో మిడతల దాడి గురించి ప్రేక్షకులకు తెలియచేయాలనుకున్నానని.. దీని ప్రేరణకు బందోబస్త్ సినిమాకి దర్శకత్వం వహించానని చెప్పాడు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే మిడతల దాడి గురించి బందోబస్త్ చూపించానని చెప్పాడు.

30 ఏళ్ల క్రితం కూడా భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మిడతలు పెద్ద సమూహాంగా వచ్చి ఒక్కసారిగా పంటపొలాలపై దాడి చేస్తాయి. వీటిల్లో చాలా జాతులున్నాయని కె.వి ఆనంద్ అన్నారు. 

click me!