బాలుడిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్​.. సంచలన తీర్పునిచ్చిన ముంబై కోర్టు..

Published : Dec 30, 2021, 11:42 AM IST
బాలుడిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్​.. సంచలన తీర్పునిచ్చిన ముంబై కోర్టు..

సారాంశం

ఓ చర్చి ఫాదర్.. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరేళ్ల క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా POCSO ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది.  

ఓ చర్చి ఫాదర్.. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరేళ్ల క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా POCSO ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. 2015 ఆగస్టులో ఓ చర్చిలో క్యాథలిక్ మతగురువుగా ఉన్న ఫాదర్ జాన్సన్ లారెన్స్‌‌‌.. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు విచారణ చేపట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఫాదర్ జాన్సన్ లారెన్స్‌ను (Jhonson Lawrence) పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితులు జైలులో ఉన్నాడు. 

బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం.. బాధితుడు నిత్యం ప్రేయర్ చేసేందుకు చర్చికి వెళ్లేవాడు. ఆగస్టు 2015లో ఒకరోజు.. నిందితుడు బాలుడిని చర్చిలో ఒంటరిగా ఉండమని అడిగాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బాలుడిని నిందితుడు బెదిరించాడు. దీంతో భయపడిన బాలుడు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నవంబర్‌లో నిందితుడు మరోసారి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రవర్తనలో మార్పు రావడంతో.. తల్లిదండ్రులు నీలదీసేసరికి అసలు విషయం బయటపెట్టేశాడు. 

ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుడు తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పాడు. అతనిపై వచ్చిన అభియోగాలను ఖండించాడు. అతని తరఫున వాదనలు వినిపించిన లాయర్ అనినాశ్ రసాల్ కూడా కోర్టులో ఇదే రకమైన వాదనలు వినిపించారు. తన క్లయింట్ తప్పు చేశాడని అనడానికి ఎటువంటి సాక్ష్యం లేదని వాదించాడు. నిందితుడి బెడ్‌షీట్, బట్టలపై వీర్యం లేదా రక్తం జాడ లేదని కూడా రసాల్ చెప్పుకొచ్చాడు. 

మరోవైపు నిందితుడికి వ్యతిరేకంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ Veena Shelar వాదనలు వినిపించారు. కోర్టు అనుమతితో ఆమె మొత్తంగా తొమ్మది మంది సాక్షులను ఎగ్జామిన్. వారిలో బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మెడికల్ సాక్ష్యాలు బాలుడి వాంగ్మూలాన్ని ధ్రువీకరించాయని ఆమె పేర్కొన్నారు.  ఇక, 2015 ఆగస్టు, నవంబర్‌లో తనపై దాడి జరిగిందని బాలుడు చెప్పాడు. 

ఇక, ఈ కేసుకు సంబంధించి పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. చిన్నారులపై లైగింక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో)లోని సెక్షన్​ 6, 12 ప్రకారం నిందితుడు జాన్సన్ లారెన్స్‌ను న్యాయమూర్తి సీమా జాధవ్ (Seema Jadhav) దోషిగా తేల్చారు. జాన్సన్​ లారెన్స్​కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !