ముంబయి దారుణ హత్య కేసు.. బాధితురాలు అనాథ, రేషన్ షాప్‌లో నిందితుడితో పరిచయం

By Mahesh KFirst Published Jun 8, 2023, 5:28 PM IST
Highlights

ముంబయి దారుణ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అనాథ అని తెలిసింది. నిందితుడు రేషన్‌ షాప్‌లో పని చేసేవాడు. రేషన్ షాప్‌లోనే బాధితురాలు ఆయనను కలిసింది.
 

ముంబయి: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ముంబయిలో దారుణ హత్య జరిగింది. సహజీవనం చేస్తున్న తన భాగస్వామిని ఆ దుండగుడు దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్ బాడీని ముక్కలుగా నరికేశాడు. నీటిలోనూ ఆ బాడీ ముక్కలను ఉడికించాడు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాధితురాలు, నిందితుడిని 2014లో ముంబయిలో బోరివలీలోని ఓ రేషన్ షాప్‌లో కలిసింది. నిందితుడు 56 ఏళ్ల మనోజ్ సానె ఆ రేషన్ షాప్‌లో వర్కర్. అక్కడే బాధితురాలు సరస్వతి వైద్య కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంటిలో నివసించారు. 

సరస్వతి వైద్య అనాథ. మనోజ్ సానెతో జీవితాన్ని పంచుకోవాలని ఆశ పడింది. మనోజ్ సానె, ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ, కలిసి జీవించారు. మనోజ్ సానెకు బోరివలిలో సొంత ఇల్లు ఉన్నది. కానీ, ఆయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. మీరా రోడ్‌లోని ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 704 గదిలో వారిద్దరూ కలిసి ఉన్నారు. గత ఐదేళ్లుగా అందులోనే ఉన్నారు. కానీ, వారిద్దరు ఇరుగు పొరుగుతో పెద్దగా కలిసేవారు కాదు. సరస్వతి వైద్య చనిపోయాకే ఆ అపార్ట్‌మెంట్ వాసులకు వారి పేర్లు తెలిశాయి.

సరస్వతి వైద్య, మనోజ్ సానెలు ఉంటున్న గది నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పొరుగున ఉండే సోమేశ్ శ్రీవాస్తవకు అనుమానం వచ్చింది. ఆ తలుపు మొదటిసారి తట్టగా మనోజ్ సానె బయటకు రాలేదు. కొంత సేపటికి వచ్చాడు. బయటికి రావడానికి ముందు స్ప్రే కొట్టిన చప్పుడు వినిపించింది. తాను ఓ పని మీద బయటకు వెళ్లుతున్నట్టు మనోజ్ సానె తనకు చెప్పినట్టు సోమేశ్ శ్రీవాస్తవ వివరించారు. వెంటనే ఆయన అపార్ట్‌మెంట్ వాసులను అలర్ట్ చేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

Also Read: జ్ఞానవాపి పిటిషనర్ల మధ్య విభేదాలు? కారుణ్య మరణానికి అనుమతివ్వాలని రాష్ట్రపతికి పిటిషనర్ లేఖ.. జూన్ 9 డెడ్ లైన్

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంటే బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగా కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. ఓ మహిళ డెడ్ బాడీని ముక్కలు చేసినట్టుగా పోలీసులు అనుమానించారు. కొన్ని ముక్కలు బకెట్‌లో కనిపించగా.. మరికొన్ని ముక్కలు కుక్కర్‌లో ఉడికిస్తుండగా చూశారు.

కుళ్లిపోయిన ఆ బాడీ పార్టులను ముంబయిలోని జేజే హాస్పిటల్ తరలించారు. మనోజ్ సానెపై నయా నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు మీరా రోడ్డు డీసీపీ జయంత్ బజ్‌బాలే తెలిపారు. 

కాగా, తన భాగస్వామి విషం తాగి మరణించిందని మనోజ్ సానె చెబుతుండటం గమనార్హం.

click me!