ప్రాణం తీసిన ఫోన్.. దొంగను పట్టుకోబోయి, రైలుకింద పడి...

Published : Jun 01, 2021, 05:03 PM IST
ప్రాణం తీసిన ఫోన్.. దొంగను పట్టుకోబోయి, రైలుకింద పడి...

సారాంశం

ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దొంగను పట్టుకోబోయి రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న లోకల్ ట్రైన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 

ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దొంగను పట్టుకోబోయి రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న లోకల్ ట్రైన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ఓ దొంగ ప్రయత్నించాడు. దీంతో విద్యాపాటిల్ (35) అనే ఆ మహిళ దొంగతో పోరాడింది. పెనుగులాటలో రైల్లో నుంచి జారిపడిపోయింది. బాధితురాలిని డోంబివ్లి నివాసిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఆమె ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్ లో రైలు ఎక్కారు. ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి 7.15 గంటలకు కల్వా స్టేషన్ దగ్గర కంపార్ట్ మెంట్లోకి ప్రవేశించాడు. అతడు పాటిల్ దగ్గరున్న ఫోన్ లాక్కుని రైలు దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. 

దారుణం: కోవిడ్ మృతదేహాలను పీక్కుతింటున్న కుక్కలు... స్థానికుల కంటతడి...

కానీ ఆమె దాన్ని ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమెను నెట్టేశాడు. దీంతో ఆమె రైలు కింద పడిపోయింది. కాగా మహిళను రక్షించే ప్రయత్నంలో కోచ్ లోని ప్రయాణికులు వెంటనే గొలుసును లాగారు.

ఆ తర్వాత రైలు డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని మంబ్రాకు చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!