గీజర్ నుంచి విష వాయువు... మైనర్ బాలిక మృతి

By telugu teamFirst Published Jan 15, 2020, 8:25 AM IST
Highlights

అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు


గీజర్ లో నుంచి వచ్చిన విష వాయువు కారణంగా ఓ మైనర్ బాలిక మృతి చెందింది. కాగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

Also Read నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్..

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ధృవి గోహిల్‌ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్‌ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. 

click me!