
ఖాట్మాండు: 34 ఏళ్ల భారతీయ పర్వతారోహకుడు నేపాల్‌లోని మౌంట్ అన్నపూర్ణపై తప్పిపోయా డు. రాజస్తాన్‌లోని కిషన్‌గడ్‌కు చెందిన అనురాగ్ మాలు అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ 3 నుంచి దిగుతుండగా మిస్ అయ్యాడని సెవెన్ సమిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా పీటీఐకి తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని వివరించారు.
ప్రపంచంలోని అతిఎత్తైన పర్వతాల్లో మౌంట్ అన్నపూర్ణ పదోది. ఈ పర్వతం ఎత్తు సముద్ర మట్టానికి 8,091 మీటర్లు. అనురాగ్ మాలు 8,000 మీటర్లకంటే ఎత్తైన మొత్తం 14 పర్వతాలను అధిరోహించాలని అనుకున్నాడు. ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ మిషన్ పై అనురాగ్ మాలు ఉన్నాడు.
అనురాగ్ మాలు మిస్ అయినట్టు తెలిసిన వెంటనే తాము ఆయన కోసం ముమ్మర గాలింపులు జరుపుతున్నట్టు షెర్పా వివరించారు. సోమవారం సాయంత్రం వరకు తమకు అనురాగ్ మాలు ఆచూకి లభించలేదని తెలిపారు. అయితే, మంగళవారం కూడా తాము ఆయన కోసం వెతుకుతామని అన్నారు.
Also Read: పర్యాటకంపై ఇష్టంతో కంపెనీ పెట్టిన సజ్నా అలీ.. సోలోగా మహిళలు ట్రావెల్ చేయడానికి సహకారం
అనురాగ్ మాలు రెక్స్ కరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత. ఇండియా నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్‌గా ఎదిగారు.