తిరిగి సొంత గూటికి.. నా ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ

By Siva KodatiFirst Published Jun 12, 2021, 5:42 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ శుక్రవారం టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. కేంద్రం తనకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో ముకుల్ రాయ్ కోరారు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ శుక్రవారం టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. కేంద్రం తనకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో ముకుల్ రాయ్ కోరారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆయనకు ఉన్న ‘వై ప్లస్’ కేటగిరీ భద్రతను ‘జడ్’ కేటగిరీగా మార్చింది. కుమారుడు శుభ్రాంస్ రాయ్‌తో కలిసి ముకుల్ రాయ్ నిన్న బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని ముకుల్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read:టీఎంసీలోకి మళ్లీ ముకుల్ రాయ్?.. బీజేపీకి భారీ షాక్..!.. కారణం అదే..

మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమాతో టీఎంసీని వీడి కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో చాలామంది తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 35 మంది బీజేపీ నేతలు తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వారిని పార్టీలోకి తిరిగి ఆహ్వానించే విషయంలో ఆచూతూచి వ్యవహరించాలని సీఎం మమత యోచిస్తున్నారు. 
 

click me!