పంజాబ్‌ రాజకీయాల్లో సంచలనం: అకాలీదళ్‌తో జతకట్టిన బీఎస్పీ.. సీట్ల ఖరారు పూర్తి

By Siva KodatiFirst Published Jun 12, 2021, 5:18 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల వేళ.. పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2022లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ సందర్భంగా శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ రాజకీయాల్లో ఇదొక కొత్త శకంగా అభివర్ణించారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ.. పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2022లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈ సందర్భంగా శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ రాజకీయాల్లో ఇదొక కొత్త శకంగా అభివర్ణించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, తదుపరి జరిగే ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని బాదల్ వెల్లడించారు. అదే విధంగా బీఎస్పీ జనరల్ సెక్రటరీ సతీష్‌ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఈ రోజు పంజాబ్‌ రాజకీయాలను మలుపు తిప్పే చారిత్మాకమైన రోజు అన్నారు.

Also Read:బిజెపికి బిగ్ షాక్... శివసేన బాటలోనే అకాలీదళ్, ఎన్డీఏ నుండి బైటకు

బీఎస్పీ అధినేత్రి మామావతి అధ్యక్షతన పంజాబ్‌ అసెంబ్లీలోని మొత్తం 117 సీట్లకు గాను​ 20 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయనుందని చెప్పారు. మిగిలిన సిట్లలో శిరోమణి అకాలీదళ్‌ పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. గత 23 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్‌ ... బీజేపీకి మిత్రపక్షంగా ఎన్‌డీఏ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఎస్ఏడీ.. ఎన్‌డీఏ కూటమి నుంచి వైదోలిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శిరోమణి అకాలీదళ్‌ ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగింది. తాజాగా శిరోమణి అకాలీదళ్‌ బీఎస్పీతో జతకట్టడంపై పంజాబ్‌‌తో పాటు దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. 

click me!