బ్రేకింగ్ .. కేంద్ర ప్ర‌తిపాద‌న తిరస్కరించిన ముకుల్ రోహత్గీ.. ఆ ప‌ద‌వీ చేప‌ట్టేందుకు విముఖ‌త 

By Rajesh KarampooriFirst Published Sep 25, 2022, 10:54 PM IST
Highlights

భారత తదుపరి అటార్నీ జనరల్‌గా ఉండేందుకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆదివారం నిరాకరించారు. కేకే వేణుగోపాల్ స్థానంలో ముకుల్ రోహత్గీని నియ‌మించాలని కేంద్రం భావించింది. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు కూడా చేసింది.  కానీ అంతకు ముందు అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కేంద్ర‌ప్ర‌భుత్వ అత్యున్న‌త ప్ర‌తిపాద‌న‌ను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిర‌స్క‌రించారు. భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సేవ‌లందించేందుకు ఆయ‌న నిరాకరించారు. గత కొన్ని రోజులుగా.. త‌దుప‌రి భారత అటార్నీ జనరల్‭గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి ఆ పదవిని చేపట్టనున్నట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆ ప్రచారానికి పుల్ స్ఠాప్ పెడుతూ..  త‌న‌కు ఆ ప‌ద‌విపై ఆస‌క్తి  లేద‌ని ఆదివారం ప్రకటించారు. కానీ,  తిరస్క‌రించాడ‌నికి గ‌ల కారణాలను రోహత్గీ వెల్లడించలేదు. ఈ ఆఫర్‌ను మరోసారి పరిశీలించి తిరస్కరించినట్లు న్యాయవాది తెలిపారు. 

ముకుల్ రోహత్గీ 2014 నుండి 2017 వరకు భారతదేశ అటార్నీ జనరల్‌గా ప‌నిచేశారు. అయితే 2017 జూన్‌లో ఆయ‌న త‌న‌ వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మరోవైపు, 2017లో ముకుల్ రోహత్గీ అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయ‌న స్థానంలోకి   కేకే వేణుగోపాల్ వ‌చ్చారు. అయితే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. దీని తరువాత రోహత్గీ అటార్నీ జనరల్ అవుతాడని చర్చ జరిగింది, కానీ అతను ఈ పదవిని తిరస్కరించాడు.

ప్రస్తుతం భారత అటార్నీ జనరల్‌గా ప‌నిచేస్తూ..  కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే.. మోడీ ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించినప్పటికీ.. త‌న వ‌య‌స్సు రీత్యా ఆ ఆఫ‌ర్ ను తిరస్కరించారు.  వేణుగోపాల్‌ వయసు 91 ఏళ్లు. కేకే వేణుగోపాల్ స్థానంలో రోహత్గీకి అటార్నీ జనరల్ పదవిని కేంద్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఆఫర్ చేసింది.

న్యాయవాది ముకుల్ రోహత్గీ.. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రోహత్గీ అత్యంత సన్నిహితుడు. 2014లో అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ వైఖరిని వ్య‌తిరేకిస్తూ 2017 జూన్ రెండో వారంలో ఏజీ పదవికి రోహత్గీ రాజీనామా చేశారు. అనంతరం లాయ‌ర్ గా ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు.  
 

click me!