బరువు తగ్గితే రూ. 10 లక్షల ఆఫర్.. ఉద్యోగులకు ఈ కంపెనీ సీఈవో చాలెంజ్

By Mahesh KFirst Published Sep 25, 2022, 7:00 PM IST
Highlights

బరువు తగ్గితే రూ. 10 లక్షలు అందిస్తామని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధ సీఈవో నితిన్ కామత్ తమ ఉద్యోగులకు సంచలన చాలెంజ్ విసిరారు. ఇందుకోసం కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్ అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధ సీఈవో సంచలన చాలెంజ్ విసిరారు. తమ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారిని యాక్టివ్ చేయడానికి చాలెంజ్ చేశాడు. అంతేకాదు, టార్గెట్లు పెట్టి ప్రోత్సాహకాలనూ ప్రకటించారు. 

జెరోధా సీఈవో నితిన్ కామత్ తమ ఉద్యోగులకు స్వచ్ఛందంగా పాల్గొనే ఓ చాలెంజ్ చేశారు. ఆ చాలెంజ్ నెగ్గితే రూ. 10 లక్షలు గెలుచుకోవచ్చని ఆఫర్ ప్రకటించారు. ప్రతి రోజు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాలనేది ఆ చాలెంజ్ షరతు. కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్2పై ప్రతి రోజూ గోల్స్ పెట్టుకునే ఆప్షన్‌ ఇచ్చారు.

తమ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో డైలీ యాక్టివిటీ గోల్స్ పెట్టుకునే ఆప్షన్‌ను తమ ఉద్యోగులకు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. పెట్టుకున్న గోల్స్‌లో 90 శాతం సాధిస్తే.. వచ్చే ఏడాది ఒక నెల జీతం బోనస్ అందుకోవచ్చని వివరించారు. అంతేకాదు, ఒక లక్కీ డ్రా విజేతకు రూ. 10 లక్షలు కూడా అందిస్తామని లింక్‌డ్ ఇన్‌లో పేర్కొన్నారు.

తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనూ యాక్టివ్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ చాలెంజ్ చేసినట్టు వివరించారు. తమలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పని చేస్తున్నారని తెలిపారు.

click me!