కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

Published : Jul 06, 2022, 05:00 PM ISTUpdated : Jul 06, 2022, 05:47 PM IST
కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

సారాంశం

కేంద్ర మంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం నాడు రాజీనామా చేశారు. త్వరలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నఖ్వీ ని బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ తరుణంలో నఖ్వీ రాజీనామా చర్చకు దారి తీసింది.


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి  ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం నాడు రాజీనామా చేశారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు. మోడీ కేబినెట్ లో నఖ్వీ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి గా పనిచేస్తున్నారు. నఖ్వీ మంత్రిగా చేసిన సేవలను ప్రధాని మోడీ మంత్రివర్గ సమావేశంలో కొనియాడారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ పదవీ కాలం పూర్తైంది. అయితే రాజ్యసభ ఎంపీ పదవిని నఖ్వీకి పొడిగించలేదు. అయితే ఇదే తరుణంలో ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును కూడా పరిశీలిస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది.

ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చ సాగుతుంది. గురువారంతో నఖ్వీ రాజ్యసభ పదవీకాలం పూర్తి కానుంది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కు ఈ దఫా యూపీ నుండి బీజేపీ నాయకత్వం అవకాశం కల్పించింది. 

కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బీజేపీ జాతీయ కార్యాలయంలో కలిశారు. ఉప రాష్ట్రపతి పదవికి నఖ్వీ పేరును బీజేపీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం కూడా సాగుతుంది. ఈ ఏడాది ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నారు.1957 అక్టోబర్ 15న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జన్మించారు.  బీజేపీ మైనారిటీ మోర్చా నేతగా నఖ్వీ పనిచేశారు. 

also read:లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను పరామర్శించిన సీఎం నితీష్ కుమార్.. ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా..

నుపుర్ శర్మ ఉదంతంతో విదేశాల్లో ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాల్లో భారత వస్తువులను బహిష్కరించే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ముస్లిం వర్గానికి చెందిన వారికి అత్యున్నత పదవిని ఇవ్వాలని బీజేపీ యోచిస్తుందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నఖ్వీ పేరును ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాజ్‌పేయ్ కేబినెట్ లో పనిచేసిన ఇద్దరిలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఒకరు., వాజ్‌పేయ్ కేబినెట్ లో రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు 10న వెంకయ్యనాయుడు పదవీ కాలం పూర్తి కానుంది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19న చివరి తేదీ. ఉప రాష్ట్రపతి పదవికి కేరళ గవర్నర్ ఆరిఫ్  మహమ్మద్, ఖాన్, మాజీ కేంద్ర మంత్రి నజ్మా హెఫ్తుల్లా, ,పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ల పేర్లను కూడా ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు. విపక్షాల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. 


 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?