మీరు ఎన్ఆర్ఐనా?.. ఆనంద్ మహీంద్రా సమాధానానికి నెటిజన్లు ఫిదా

Published : Jul 06, 2022, 05:00 PM IST
మీరు ఎన్ఆర్ఐనా?.. ఆనంద్ మహీంద్రా సమాధానానికి నెటిజన్లు ఫిదా

సారాంశం

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సమాధానంతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. మీరు ఎన్ఆర్ఐనా అని ఓ నెటిజన్ అడిగిన సమాధానానికి తనదైన శైలిలో జవాబిచ్చాడు. చాలా మంది ఆయన కామెంట్‌కు ఫిదా అయ్యారు.  

న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వైరల్ వీడియోలు, జీవితాలను మార్చే సలహాలతో చాలా మందికి చేరువలో ఉంటారు. చాలా విషయాలపై ఆయన తన ఫాలోవర్లతో తరుచూ సంభాషిస్తుంటారు. ఈ సారి ఆయన వైరల్ వీడియోనో.. లేక తనదైన వ్యాఖ్యానమో కాదు గానీ.. ఓ నెటిజన్ వేసిన పశ్నకు చెప్పిన సమాధానం వైరల్ అవుతున్నది. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆనంద్ మహీంద్ర జులై 4వ తేదీన అమెరికాలో ఉన్నారు. జులై 4వ తేదీ అంటే.. అమెరికా స్వాతంత్ర్య పొందిన రోజు. ఈ సందర్భంగా ఆయన అమెరికాలోని మాన్‌హాటన్ నగరం నుంచి కొన్ని ఫొటోలు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడ బాణా సంచా పేల్చారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్ త్రెడ్‌లో పోస్టు చేశారు.

ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ఫొటోలకు ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. మీరు ఎన్ఆరఐనా? అంటూ అడిగాడు. చాలా మంది అసలు అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇతరులు కొందరు ఆనంద్ మహీంద్రాకు సూచించారు. కానీ, ఆయన వాటిని పక్కనెపెట్టి సమాధానం ఇచ్చాడు. న్యూయార్క్‌లోని కుటుంబాన్ని విజిట్ చేస్తున్నానని వివరించారు. అంటే.. ఆ లెక్కన తాను హెచ్ఆర్ఐ అని తెలిపారు. ఎన్‌ఆర్ఐ లాగా నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదని.. హార్ట్ (ఎల్లప్పుడూ) రెసిడెంట్ ఇండియాను అని వివరించారు.

హెచ్ఆర్ఐ అంటూ ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు ఎక్కువ సేపు చర్చించుకున్నారు. ఆయన కామెంట్‌పై ప్రశంసలు గుమ్మరించారు. చాలా మంది ఆయన ట్వీట్‌కు ఫిదా అయ్యారు.

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?