కవలలకు జన్మనిచ్చిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా.. అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు..

Published : Nov 20, 2022, 04:02 PM IST
 కవలలకు జన్మనిచ్చిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా.. అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు..

సారాంశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్.. నవంబర్ 19వ తేదీన  కవల పిల్లలకు స్వాగతించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్.. నవంబర్ 19వ తేదీన  కవల పిల్లలకు స్వాగతించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అంబానీ, పిరమల్ కుటుంబాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కవల పిల్లలో.. ఒక పాప, బాబు ఉన్నారని పేర్కొన్నాయి. పాపకు ఆదియా అని పేరు పెట్టగా, బాబుకు కృష్ణ అని పేర్లు పెట్టినట్టుగా తెలిపాయి. ప్రస్తుతం ఇషా, ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారని వెల్లడించాయి. 

‘‘ఈ అతి ముఖ్యమైన దశలో ఆదియా, కృష్ణ, ఇషా, ఆనంద్‌లకు మేము మీ ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలు కోరుకుంటున్నాము’’ అని అంబానీ, పిరమల్ కుటుంబాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇషా అంబానీ పండంటి కవలలకు జన్మనివ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. 

ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుమార్తె ఇషా అంబానీ.. పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ల వివాహం 2018 డిసెంబర్‌లో జరిగింది. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త ఆనంద్ పిరమల్ పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ముఖేష్ అంబానీ దంపతులు తమ మొదటి మనవడు పృథ్వీని 2020 డిసెంబర్‌లో స్వాగతించారు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకాల కుమారుడే పృథ్వీ.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం