నాగాల్యాండ్ జైలు నుంచి హత్యా నేరస్తులు, ఇతర ఖైదీలు పరార్

By Mahesh KFirst Published Nov 20, 2022, 3:01 PM IST
Highlights

నాగాల్యాండ్ జైలు నుంచి కనీసం 9 మంది ఖైదీలు పారిపోయారు. శనివారం ఉదయం వీరంతా జైలు నుంచి పారిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో హత్యా నేరస్తులు సహా విచారణ ఖైదీలు ఉన్నారు.
 

న్యూఢిల్లీ: నాగాల్యాండ్ జైలు నుంచి హత్యా నేరస్తులు, విచారణ ఖైదీలు మొత్తం 9 మంది పరారయ్యారు. మోన్ జిల్లా జైలు నుంచి కనీసం తొమ్మిది మంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. వారి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు.

పారిపోయిన వారిలో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, మర్డర్ కేసులో దోషులుగా తేలిన ఖైదీలూ ఉన్నట్టు పోలీసు అధికారి తెలిపారు. వీరంతా ఎలాగోలా జైలు తాళాలు దక్కించుకున్నారు. శనివారం తెల్లవారుజామునే కారాగారం నుంచి పారిపోయారు.

ఇందుకు సంబంధించి మోన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ జరుగుతున్నది.

Also Read: జైలు సిబ్బందిపై దాడి.. పారిపోయిన ఆరుగురు ఖైదీలు: పోలీసులు

పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆ పోలీసు అధికారి వివరించారు. అంతేకాదు, ఇతర ఏజెన్సీలనూ అలర్ట్ చేశామని, లుక్ ఔట్ నోలీసులూ జారీ చేశామని తెలిపారు. పారిపోయిన వారి గురించి ఏ సమాచారం దొరికినా వెంటనే పోలీసులకు తెలుపాలని విలేజీ కౌన్సిళ్లకు ఆదేశించామని వివరించారు.

click me!