అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు

By narsimha lode  |  First Published Mar 4, 2024, 11:02 AM IST

ప్రజా ప్రతినిధుల అవినీతి కేసుల్లో  సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించింది.


న్యూఢిల్లీ: లంచం కేసుల్లో  ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పును వెల్లడించింది.  గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.  ప్రజా ప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 
లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తెలిపింది.చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకొంటే రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.ఈ విషయమై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) శాసనసభలో ప్రసంగించడానికి లేదా ఓటు చేయడానికి లంచం తీసుకున్నందుకు ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు  సోమవారంనాడు తీర్పును వెల్లడించింది.ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును  ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ను ఏకగ్రీవంగా కొట్టివేసింది.

Latest Videos

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం  1988లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని  స్పష్టం చేసింది.

లంచం కేసులో అభియోగాలపై విచారణ నుండి రక్షణ కోరరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.1998లో పీవీ నరసింహారావు, వర్సెస్ స్టేట్ కేసు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది జార్ఖండ్  ఎమ్మెల్యే సీతా సోరేన్ కేసును సుప్రీంకోర్టు విచారించింది.2012లో  రాజ్యసభ ఎన్నికల సమయంలో లంచం తీసుకొని ఓటు వేశారని సీతా సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి.ఈ కేసును విచారించి గత ఏడాది అక్టోబర్  5న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.చట్టసభ్యుల అవినీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 

click me!