చంద్రబాబుపై కేవీపీ ఫైర్

By rajesh yFirst Published Sep 15, 2018, 3:08 PM IST
Highlights

సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మానసిక స్థితి సరిగ్గాలేదంటూ విమర్శించారు. 

ఢిల్లీ: సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మానసిక స్థితి సరిగ్గాలేదంటూ విమర్శించారు. పోలవరం గ్యాలరీలో నడిచి ప్రాజెక్టునే జాతికి అంకితం చేసినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్పిల్‌ వేలో గ్యాలరీ నిర్మాణం ఒక భాగం మాత్రమే అని కేవీపీ చెప్పుకొచ్చారు. 2019లో రాహుల్‌గాంధీ ప్రధాని హోదాలో పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తారని కేవీపీ స్పష్టం చేశారు.

చంద్రబాబు సీఎంగా ఉంటే ఎప్పుడే అప్పులేనట...ఉండవల్లి

రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు నాయుడుపై రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఎప్పుడు అప్పులేనని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏనాడు ఓవర్ డ్రాప్ట్ కి వెళ్లలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో అంతా ఓవర్ డ్రాప్ట్ లేనన్నారు.

మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతి బాండ్లపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇటీవలే చంద్రబాబును కలిసి ప్రశంసించిన ఉండవల్లి ఆ చర్చ ముగియకుండానే మళ్లీ విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 

click me!