గిరిజనుడిపై మూత్ర విసర్జన: బాధితుడు రావత్ కాళ్లు కడిగిన సీఎం చౌహాన్

Published : Jul 06, 2023, 11:28 AM ISTUpdated : Jul 06, 2023, 11:41 AM IST
 గిరిజనుడిపై మూత్ర విసర్జన: బాధితుడు రావత్ కాళ్లు కడిగిన  సీఎం చౌహాన్

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  సిద్ది జిల్లాకు  చెందిన  గిరిజనుడు  దశ్‌మత్ రావత్  కాళ్లు కడిగారు  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. రావత్ పై  ప్రవీష్ శుక్లా  మూత్ర విసర్జన  చేసిన విషయం తెలిసిందే.


భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ది జిల్లాకు  చెందిన  బాధితుడు  దశ్‌మత్  రావత్  సీఎం  శివరాజ్ సింగ్ చౌహన్ కాళ్లు కడిగారు.   ఇటీవలనే  దశ్ మత్ రావత్  పై   ప్రవేష్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   బాధితుడు  దశ్‌మత్ రావత్ ను  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారంనాడు భోపాల్ లోని తన ఇంటికి పిలిపించుకున్నాడు.

 దశ్ మత్ రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టి  ఆయన కాళ్లు కడిగారు.ఈ సమయంలో  బాధితుడు  తన కాళ్లు కడగవద్దని  సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ ను  కోరారు. అయితే  బాధితుడు  దశ్ మత్  రావత్  కు  సీఎం చౌహాన్ సర్ధిచెప్పారు. ఆ తర్వాత  రావత్ కాళ్లు కడిగారు.  రావత్ ను  సన్మానించారు.   రావత్ కు జరిగిన  అవమానానికి సంబంధించిన  వీడియో తన దృష్టికి రావడంతో  తాను చాలా బాధ పడినట్టుగా  సీఎం శివరాజ్ సింగ్  చౌహాన్ పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటన పట్ల  రావత్ ను  సీఎం చౌహాన్ క్షమాపణలు కోరాడు.  తనకు ప్రజలు దేవుళ్లతో సమానంగా ఆయన  పేర్కొన్నాడు.

 

గిరిజనుడు  రావత్ పై  ప్రవీష్ శుక్లా  మూత్ర విసర్జన చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  ఈ విషయమై  శివరాజ్ సింగ్ చౌహాన్  సర్కార్ పై   విపక్షాలు  విమర్శలు గుప్పించాయి.ఇదిలా ఉంటే  ప్రవీష్ శుక్లా ఇంటిని  ప్రభుత్వం కూల్చివేసింది.  గిరిజనుడిపై  మూత్ర విసర్జన  ప్రవీష్ శుక్లాను పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ ఘటనను  ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.   ఈ ఘటన  ఏడాదిన్నర క్రితం జరిగిందిగా   చెబుతున్నారు. అయితే  ఈ వీడియో ఇటీవల  బయటకు వచ్చింది.  ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో  ప్రభుత్వం ప్రవీష్ శుక్లాపై  చర్యలు తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్