
కర్ణాటక : బెలగావిలో ఓ తహసిల్దారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అశోక్ మణ్ణికేరి (47)అనే తహసిల్దారు జూన్ 29వ తేదీన ఇంట్లోనే మృతి చెందాడు. అయితే, అతని మృతి కేసులో ఇప్పుడు ఓ ట్విస్ట్ వెలుగు చూసింది. భార్య వేధింపుల కారణంగానే అతను చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.
అతను చనిపోయిన సమయంలో తీవ్ర గుండెపోటుతో చనిపోయినట్లుగా భార్య అందరికీ తెలిపింది. అశోక్ కుటుంబ సభ్యులు అతని మృతి మీద అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Manipur Violence: మణిపూర్ బాధను చూసి గుండె పగిలింది.. : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ
జూన్ 29వ తేదీన.. తెల్లవారుజామున రెండున్నర గంటలకు తన భర్తకు తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా తాసిల్దార్ భార్య అందరికి చెప్పింది. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెలగావి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసిల్దార్ లాకర్లో ఆయన రాసి పెట్టుకున్న డెత్ నోట్ లభించింది. జూన్ 20వ తేదీన ఇది రాసినట్టుగా అందులో తేదీ ఉంది.
ఆ ఉత్తరంలో ఏం రాశారంటే.. తన భార్య వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా రాసుకొచ్చారు. కాగా, అశోక్ మణ్ణికేరిది లవ్ మ్యారేజ్. కొన్నేళ్ల కిందట వేరే కులానికి చెందిన భూమి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాలు వేరవడంతో ఆయన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు.
వారి ఇష్టానికి వ్యతిరేకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇంకా ఆ డెత్ నోట్ లో... రోజురోజుకి తన భార్య వేధింపులు ఎక్కువైపోతున్నాయని.. ఉద్యోగం కూడా చేయలేకపోతున్నానని.. రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా రాశాడు. తహసీల్దార్ చనిపోవడానికి 15 రోజులు ముందు ఇంటికి కూడా వెళ్లలేదు.
స్నేహితులై ఇళ్లల్లోనే తలదాచుకున్నాడు. ఆ తర్వాత జూన్ 29వ తేదీన ఇంటికి వెళ్లిన అతడు తెల్లవారికి మృతి చెందాడు. ఆయన లాకర్లో బయటపడిన డెత్ నోట్ ఆధారంగా ఇప్పుడు ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెత్ నోట్ ను ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత తాసిల్దార్ మరణంపై స్పష్టత రానందుని చెబుతున్నారు.