గుడిలో బాలికపై అత్యాచారం.. పూజారులే నిందితులు

Published : Oct 04, 2018, 09:55 AM IST
గుడిలో బాలికపై అత్యాచారం.. పూజారులే నిందితులు

సారాంశం

బాలికను ఇంటి వద్ద దిగబెట్టి విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పినట్లు తెలిపారు. బాలిక నొప్పితో బాధపడుతుండడం గమనించిన ఆమె తల్లి ఆరా తీయగా.. జరిగిన సంఘటన గురించి వివరించింది. 

మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై గుడిలో ఇద్దరు పూజారులు అత్యాచారానికి పాల్పడ్డారు. చాక్లెట్లు ఆశచూపి గుడిలోకి పిలిచి.. దారుణానికి ఒడిగడ్డారు. తర్వాత బాలికను ఇంటి వద్ద దిగబెట్టి విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పినట్లు తెలిపారు. బాలిక నొప్పితో బాధపడుతుండడం గమనించిన ఆమె తల్లి ఆరా తీయగా.. జరిగిన సంఘటన గురించి వివరించింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, బాలికను ఆస్పత్రిలో చేర్పించారు.

ఇద్దరు పూజారులు 55 ఏళ్ల రాజు పండిత్‌, 45 ఏళ్ల బతోలీ ప్రజాపతిలను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఈ బాలికనే కాకుండా మరికొంత మందిపై అఘాయిత్యాలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

12 ఏళ్ల కన్నా తక్కువ వయసు గల బాలికలపై అత్యాచారం చేసిన నిందితులు దోషులుగా తేలితే మరణశిక్ష విధించే బిల్లుకు గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు వివిధ అత్యాచార కేసుల్లో 12 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చాయి.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu