యువతిపై మహిళ అత్యాచారం.. ఏ సెక్షన్‌పై కేసు పెట్టాలి.. పోలీసుల అయోమయం

sivanagaprasad kodati |  
Published : Oct 04, 2018, 09:22 AM IST
యువతిపై మహిళ అత్యాచారం.. ఏ సెక్షన్‌పై కేసు పెట్టాలి.. పోలీసుల అయోమయం

సారాంశం

తనపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడిందంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆన్‌లైన్‌లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో గత మార్చిలో రోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. 

అతడు పెట్టుబడి పెడతానని ఆశ చూపి.. స్నేహితుడు రాహుల్‌తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరింపులకు గురిచేసి.. ఆమెతో ఓ ఇంట్లో వ్యభిచారం చేయించాడు.

నాటి నుంచి అక్కడే బందీగా ఉంటున్న ఆ యువతిపై 19 ఏళ్ల యువతి సెక్స్‌టాయ్స్‌తో ఘోరానికి పాల్పడేదని.. వినకపోతే తీవ్రంగా కొట్టేదని బాధితురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. స్వలింగ సంపర్కం నేకం కాదంటూ 377 సెక్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులు ఆమెను ఎదురు ప్రశ్నించారు.

ఈ ఘటనకు సంబంధించి రోహిత్, రాహుల్‌తో పాటు సాగర్ అనే మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. అయితే అత్యాచారానికి పాల్పడిందని చెబుతున్న సదరు యువతిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.. దీంతో బాధితురాలు మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu