కొడుకును అలా చూసి, ఆనందంతో మురిసిపోయిన తల్లి..!

Published : Aug 01, 2023, 11:09 AM IST
 కొడుకును అలా చూసి, ఆనందంతో మురిసిపోయిన తల్లి..!

సారాంశం

విమానానికి పైలెట్ తన కొడుకే అనే విషయం తెలిసి ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దీనిని వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ గా మారింది.  

ప్రతి తల్లి తన కొడుకు ఉన్నత స్థాయికి వెళ్లాలనే కోరుకుంటుంది. కొడుకు ఎదుగుదలను చూసి మురిసిపోతుంది. ఆ ఎదుగుదల స్పష్టంగా కళ్ల ముందు ఎదురైతే వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. తాజాగా ఓ తల్లికి అలాంటి దృశ్యమే ఎదురైంది. కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోయింది. తాను ప్రయాణిస్తున్న విమానానికి పైలెట్ తన కొడుకే అనే విషయం తెలిసి ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దీనిని వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ఓ మహిళ విమానం ఎక్కుతూ కనపడుతుంది. విమానం ఎక్కిన తర్వాత ఎదురుగా ఉన్న తన  కొడుకుని చూడగానే తన ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక బిగ్గరగా అరవడం విశేషం. అనంతరం ఆమె తన కుమారుడిని  గట్టిగా కౌగిలించుకుంటుంది. అప్పటి వరకు ఆమెకు తాను ప్రయాణిస్తున్న విమానానికి తన కొడుకే  పైలెట్ అనే విషయం ఆమెకు తెలీదు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆమె ఆనందం కళ్లల్లో కనపడింది. ప్రస్తుతం ఈ వీడియోకి అందరూ ఫిదా అయిపోతున్నారు.


ఓ తల్లికి ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంటుందా అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అందరి మనసులను దోచేస్తున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ కన్నేయండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !