కొడుకులతో కలిసి కూతురిని చంపి.. పెరట్లో పాతిపెట్టిన తల్లి.. కారణం ఏంటంటే...

Published : Jul 25, 2023, 03:15 PM IST
కొడుకులతో కలిసి కూతురిని చంపి.. పెరట్లో పాతిపెట్టిన తల్లి.. కారణం ఏంటంటే...

సారాంశం

కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని ఓ తల్లి.. కొడుకులతో కలిసి ఆమెను దారుణంగా హతమార్చింది. ఆ తరువాత ఇంటి పెరట్లో పాతిపెట్టింది. 

బీహార్ : బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆ కూతురిని హతమార్చింది. ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో కలకలం రేపింది. ఆ తరువాత మృతదేహాన్ని ఇంటి పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టింది. 

ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఈ కేసులో తల్లిని అరెస్టు చేశారు. కూతురు రాగిణికి ప్రేమ వ్యవహారంలో  ప్రమేయం ఉందన్న కోపంతో ఆ మహిళ తన ఇద్దరు కుమారుల సాయంతో పథకం వేసి హత్య చేసిన ఘటన మేల్వార్ గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం కూతురు మృతదేహాన్ని ఇంటి పెరట్లో పాతిపెట్టింది.

మీరు ఏ విధంగానైనా పిలవండి.. మేము మాత్రం.. : మోదీ వ్యాఖ్యలపై రాహుల్ రియాక్షన్

విషయం తెలుసుకున్న స్థానికులు మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని పెరట్లో నుంచి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు.

కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, నేరానికి పాల్పడిన ఇద్దరు కుమారులను గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా, కర్నాటకలో ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. పరువు కోసం కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో అతని 20 ఏళ్ల కుమార్తె మృతి చెందింది. ఆమె మరణవార్త విని తట్టుకోలేక ఆమె ప్రేమికుడు ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్)లోని బంగారుపేట నివాసి కృష్ణమూర్తి.. అతని కూతురు కీర్తి. ఆమె వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్‌ ను ప్రేమించింది. తాను అతడినే వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో తండ్రీ కూతుళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

కూతురిని చంపేముందు రోజు కూడా కృష్ణమూర్తి కూతురితో గొడవపడ్డాడు. గంగాధర్ తో ప్రేమ, పెళ్లి మానుకోవాలని చెప్పాడు. దానికి కీర్తిని మరోసారి ఒప్పించేందుకు ప్రయత్నించాడు, దీంతో తండ్రి, కూతురు తీవ్ర స్థాయిలో గొడవ పడడానికి దారితీసిందని పోలీసు అధికారి తెలిపారు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కృష్ణమూర్తి కీర్తిని గొంతుకోసి చంపేశాడు. ఆపై హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేశాడు.

కీర్తి ఆత్మహత్య గురించి పోలీసులకు తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న వారికి అనుమానం వచ్చింది. కీర్తిది ఆత్మహత్య కాదని.. హత్య అని అనుమానించి కృష్ణమూర్తిని విచారించడం ప్రారంభించారు. ఈ లోపు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్‌ కీర్తి మృతి విషయం తట్టుకోలేకపోయాడు. 

సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి అక్కడికక్కడే మృతి చెందాడు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద కృష్ణమూర్తిని హత్య కేసులో అరెస్టు చేశామని కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ కె ధరణి దేవి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu