మీరు ఏ విధంగానైనా పిలవండి.. మేము మాత్రం.. : మోదీ వ్యాఖ్యలపై రాహుల్ రియాక్షన్

By Sumanth Kanukula  |  First Published Jul 25, 2023, 2:49 PM IST

ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు.


న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ‘‘ప్రతిపక్షాల ప్రవర్తనను బట్టి, వారు ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మేము ప్రజల ప్రయోజనాల కోసం పని చేసి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నారు.

I.N.D.I.A అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన... ప్రతిపక్షాల తీరు మారుతుందా? అని మోదీ ప్రశ్నించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందన్నారు. ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Latest Videos

అయితే ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. మణిపూర్‌ను నయం చేయడానికి ప్రతిపక్ష కూటమి సహాయం చేస్తుందని అన్నారు. మణిపూర్‌లో ఇండియా ఆత్మను పునర్నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘మిస్టర్ మోదీ.. మీకు ఏవిధంగా పిలవాలని అనిపిస్తే అలాగే పిలవండి. మేము ఇండియా. మేము మణిపూర్‌ను నయం చేయడానికి, అక్కడి మహిళలు, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. ప్రజలందరికీ ప్రేమ మరియు శాంతిని తిరిగి తెస్తాము. మేము మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాము’’రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

 

Call us whatever you want, Mr. Modi.

We are INDIA.

We will help heal Manipur and wipe the tears of every woman and child. We will bring back love and peace for all her people.

We will rebuild the idea of India in Manipur.

— Rahul Gandhi (@RahulGandhi)


మరోవైపు ప్రధాని  మోదీ  కామెంట్స్‌పై కాంగ్రెస్ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున  ఖర్గే  కూడా స్పందించారు. ప్రధాని మోదీ ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాము మణిపూర్ గురించి మాట్లాడితే.. మోదీ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. 

click me!