కుమార్తె మిస్సింగ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు... పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు...

Published : Aug 30, 2021, 12:31 PM IST
కుమార్తె మిస్సింగ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు... పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు...

సారాంశం

చిత్తౌడ్‌గఢ్‌ చూద్దామని సీమా షేఖ్ యువతితో తాను వెళ్లానని,  అదేసమయంలో సీమా షేఖ్ స్నేహితురాలు సప్నాఖటీక్ బర్త్ డే పార్టీ జరగడంతో అక్కడకు వెళ్లానని  చెప్పింది. ఆ సమయంలో సీమా షేఖ్, సప్నా ఖటీక్, సాబిర్ ఖాన్ అనే ముగ్గురూ కలిసి తన పేరిట నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినట్లు తెలిపింది. దాన్ని చూపించి తనను జయరామ్ అనే వ్యక్తికి డబ్బులు తీసుకుని అమ్మేశారని వెల్లడించింది.  

రాజస్థాన్ లోని చిత్తౌడ్‌గఢ్‌ లో వింత ఘటన వెలుగు చూసింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన నేహ అనే యువతి నెల రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. స్నేహితురాళ్లతో ఊరికి వెళ్తున్నా అని చెప్పిన కుమార్తె.. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి మున్ని దేవి కంగారు పడింది. ఆమె కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది. 

ఇటీవల ఇంటికి వచ్చిన కుమార్తెను చూసి ఏమైందని  అడగగా.. చిత్తౌడ్‌గఢ్‌ చూద్దామని సీమా షేఖ్ యువతితో తాను వెళ్లానని,  అదేసమయంలో సీమా షేఖ్ స్నేహితురాలు సప్నాఖటీక్ బర్త్ డే పార్టీ జరగడంతో అక్కడకు వెళ్లానని  చెప్పింది. ఆ సమయంలో సీమా షేఖ్, సప్నా ఖటీక్, సాబిర్ ఖాన్ అనే ముగ్గురూ కలిసి తన పేరిట నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినట్లు తెలిపింది. దాన్ని చూపించి తనను జయరామ్ అనే వ్యక్తికి డబ్బులు తీసుకుని అమ్మేశారని వెల్లడించింది.

కుమార్తె చెప్పిన విషయం విన్న తల్లి మున్ని దేవి ఆశ్చర్యపోయింది. ఈ విషయంలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి, స్టేషన్కు తీసుకెళ్ళింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో వాళ్లకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తాయి. నేహా ఎవరెవరు పేర్లు చెప్పిందో వాళ్లంతా ఒక ముఠా అని, ఆ ముఠాకు రింగ్ లీడర్ అని తెలిసింది. 

వీళ్లు పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే ఈ ముఠా.. సంబంధం చూపించినందుకు అబ్బాయి కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. ఆ డబ్బు ముందే తీసుకుని, ముఠాలోని ఒక అమ్మాయిని సదరు వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు.

ముందే అనుకున్న ప్రకారం, రెండు మూడు రోజులకే ఆ యువతి ఇంటి నుంచి పరారై పోతుంది. నేహా ఇటీవలే అలా ఒక పెళ్లి చేసుకుంది. అయితే వెంటనే ఇంటి నుంచి పారిపోవడం కుదరలేదు. నెలరోజులైనా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి కంగారు పడింది. కాగా, ఇటీవలే నేహా పేరును లాడో కుమావత్ గా మార్చి, దొంగ ఆధార్ కార్డును ఈ ముఠా తయారు చేసింది.  ఆ తర్వాత జయరామ్ మాలవీయ అనే వ్యక్తికిచ్చి ఆమెను వివాహం చేశారు. 

స్థానిక కోర్టులో పెళ్లి కి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించి మరి పెళ్లి పూర్తి చేశారు.  ఈ పెళ్ళి చేసినందుకు జయరామ్ నుంచిరూ.1.10లక్షల రూపాయలు వసూలు చేశారు. వీళ్లిద్దరూ కలిసి ఒక నెల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోవడానికి నేహా రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి పరారవడంత జయరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు నేహ, సీమా షేక్,  లక్ష్మీ లను అరెస్టు చేశారు. ఈ ముఠాకు దొంగ ఆధార్ కార్డులు తయారు చేసిచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన సాబిర్ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ ముఠా ఇలా నేహాను ఎంతమందికి ఇచ్చి దొంగ పెళ్లిళ్లు చేశారు? ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?